Varun Tej: వరుణ్ – లావణ్య ల ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలుసా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా ఈ విషయంపై గాసిప్స్ వినిపిస్తున్న క్రమంలో ఇవాళ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో వరుణ్ లావణ్యల మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది, ఇన్నాళ్లు సీక్రెట్ గా ఎలా దాచారు వంటి అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన మొదటి సినిమా మిస్టర్. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ మొదలైందని అంటున్నారు.

మిస్టర్ సినిమా తర్వాత ఈ జంట అంతరిక్షం సినిమాలో రెండోసరి కలిసి నటించారు. అప్పట్లోనే ఇద్దరి రిలేషన్ మీద వార్తలొచ్చినప్పటికీ ఇద్దరి నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో కొన్నాళ్ళకి అందరు మరిచిపోయారు. అయితే, సినిమాలు పెద్దగా చేయనప్పటికీ లావణ్య మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంటూ వస్తోంది. మెగా డాటర్ నిహారికతో కలిసి జిమ్ కి వెళ్ళటం వంటి సందర్భాలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో హడావిడి పక్కన పెడితే, మెగా ఫామిలీ నుండి ఈ ఎంగేజ్మెంట్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఏదేమైనా తమ అభిమాన హీరో ఒకింటి వాడు అవుతున్నాడన్న విషయం మెగా అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది. మరి, ఈ ఫంక్షన్ కి ఎవరెవరు హాజరవుతారు, ఫంక్షన్ సింపుల్ గా జరుగుతుందా లేక గ్రాండ్ గా జరుగుతుందా వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే రేపటివరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు