Kadali Movie : హృదయాలను హత్తుకున్న కడలి సినిమా హీరోయిన్ గుర్తుందా..?

సరిగ్గా 10 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తమిళ్ లో కాదల్ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో కడలి అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి అందరూ మాట్లాడుకున్నారు. తమిళ హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ రాధ చిన్న కుమార్తె తులసి నాయర్ హీరోయిన్ గా నటించింది.

రాధ పెద్ద కూతురు కార్తిక.. నాగ చైతన్య జోష్ సినిమాతో హీరోయిన్ అయింది. ఇక తులసి కాదల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. దీని తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది తులసి. ఈ చిత్రాన్ని రంగం 2 పేరుతో తెలుగులో విడుదల చేశారు. కానీ ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇటీవల కార్తీక వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో కనిపించిన ఓ అమ్మాయిని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు.

ఆమె ఎవరో కాదు తులసి నాయర్. ఈమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రంగం 2 సినిమా తరువాత ఈమె ఇండస్ట్రీ నుండి పూర్తిగా నిష్క్రమించింది. గత కొన్నేళ్లుగా ఎక్కడా కనిపించని ఈమె చాలా లావుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా కార్తిక వివాహ సమయంలో బాగా హైలైట్ గా నిలిచింది. దీంతో ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు