Raj Tarun : రాజ్ తరుణ్ కు ఈ అలవాటు కూడా ఉందా?.. ఇదిగో ప్రూఫ్..

Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంది. లావణ్య అనే అమ్మాయి అతను తనను శారీరకంగా వాడుకున్నాడని చివరకు తనను వదిలేశాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన పై వస్తున్న వార్తల పై మొదట్లో స్పందించిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఈ వార్తలకు స్పందించలేదన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఒకవైపు వినిపిస్తున్నా కూడా రాజ్ తరుణ్ తన సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఇక లావణ్య మాత్రం ఎక్కడా తగ్గకుండా రోజుకో విషయాన్ని బయటపెడుతుంది. ఇలాంటి క్రమంలో రాజ్ తరుణ్ గురించి ఓ సీక్రెట్ ఇన్నాళ్లకు బయటపడింది.. రాజ్ తరుణ్ కు ఉన్న ఆ అలవాటు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

లావణ్య -రాజ్ తరుణ్..

లావణ్య అనే అమ్మాయి పదకొండేళ్లగా రాజ్‌ తరుణ్‌ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి ఇప్పుడు మాల్వీ మల్హోత్రా తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.. నా రాజ్‌ నాకు కావాలి అంటూ ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఇటీవల ఆమె నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై ఇప్పటివరకు అనేక చర్చలు జరిగాయి. కానీ ఇది ఓ కొలిక్కి మాత్రం రాలేదు. అయితే వీరి పంచాయితీ న్యూస్ ఛానెల్ వరకు వెళ్లింది. దీనిపై రాజ్ తరుణ్ ఇప్పటికైనా మౌనం వీడతాడేమో చూడాలి..

Does Raj Tarun also have this habit?
Does Raj Tarun also have this habit?

రాజ్ తరుణ్ సీక్రెట్ రివిల్..

హీరో రాజ్ తరుణ్ గురించి గత రెండు నెలల క్రితం పెద్దగా తెలిసేది కాదు. అతను ఇప్పటివరకు చేసిన సినిమాలల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే హిట్ టాక్ అందుకున్నాయి. ఆ తర్వాత ఎక్కడ అతని పేరు వినిపించలేదు. ఈ ఏడాది నా సామిరంగా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేశాడు. అంతలోనే కేసులో ఇరుక్కున్నాడు. అయితే రాజ్ తరుణ్ సీక్రెట్స్ ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్న అతను నాకు స్మోకింగ్, డ్రింకింగ్ అనే అలవాట్లు లేవని చెప్పాడు. కానీ ఇటీవల లావణ్య బయట పెట్టిన ఫోటోల్లో అతని దగ్గర సిగరేట్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. మరి దీనిపై అతను ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.. ఇకపోతే ఆయన సినిమాల విషయానికొస్తే.. తిరగబడరా సామి , పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో పురుషోత్తముడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో సినిమాలు లేవని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు