Tarakaratna: తారకరత్న కుటుంబానికి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

గత ఏడాది ఇదే సమయంలో దాదాపు 23 రోజులపాటు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తారకరత్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అతి చిన్న వయసులోనే తారకరత్న మరణం ఇండస్ట్రీని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అటు అభిమానులు కూడా తీరని నిరాశను వ్యక్తం చేశారు.. ఇకపోతే గత ఏడాది జనవరి 27వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలారు. దీంతో ప్రథమ చికిత్స అందించి బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్ కి తరలించారు..అయితే అక్కడ మృత్యువుతో పోరాడి మహాశివరాత్రి రోజున శివైక్యం చెందిన విషయం తెలిసిందే.

నందమూరి తారకరత్న ఎవరో కాదు నందమూరి మోహనకృష్ణ తనయుడే.. ఇక ఈయన అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్యను మళ్లీ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. ఒంటరిగా ఇద్దరు కూతుర్లు, కొడుకు , భార్యతో జీవించిన తారకరత్న.. చాలా కాలం పాటు మీడియా ముందు కనిపించలేదు. ఒకప్పుడు సినిమాలలో నటించి ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు రావడంతో అమరావతి వంటి సినిమాలలో విలన్ గా చేసి నంది అవార్డులు కూడా అందుకున్నారు.. ఆ తర్వాత ఎక్కువ కాలం కొనసాగలేక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.. ఇక గత ఏడాది ఎన్నికల్లోకి రావాలని అడుగుపెట్టిన మొదటి రోజే అలా జరగడం నిజంగా ఆయన జీవితానికి అదే అంతిమ ఘట్టం అని చెప్పాలి.. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన విషయాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి..

తారకరత్న మరణించిన తర్వాత ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతను తారకరత్న బాబాయ్ బాలకృష్ణ తీసుకున్నారు.. ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబానికి ఎంత ఆస్తులున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే తారకరత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ తో కలిపి హైదరాబాదులో రామకృష్ణ థియేటర్స్ తో పాటు తారకరత్న థియేటర్స్ కూడా ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. మరొకవైపు ఎంకే ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు.. అలాగే వీళ్ళ ఇల్లు , ప్రాపర్టీస్, కమర్షియల్ కాంప్లెక్స్ లన్ని కలిపి దాదాపు మార్కెట్ విలువ ప్రకారం రూ .1100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. మరోవైపు అటు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరిట ఆమె తల్లిదండ్రుల నుంచి రూ.250 కోట్ల వరకు ఆస్తులు లభించాయి.. సినిమాల్లోకి వచ్చి ఆయన ఇంకొన్ని కోట్లు కూడబెట్టినట్లు సమాచారం. మొత్తంగా ఈయన కుటుంబానికి సుమారుగా రూ.1600 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు