Don 3 : శోభిత ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.?

Don 3 : హిందీ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శోభిత తెలుగులో గూడచారి సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను ఎంత రిచ్ గా తీయొచ్చు అని నిరూపించారు ఈ సినిమా మేకర్స్. ఇప్పుడు వస్తున్న గూడచారి 2 సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శోభిత ధూళిపాళ్ల. దీని కారణం అధికారికంగా రీసెంట్ గా నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరగటం.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నాగచైతన్య ఒకరు. కొంతకాలం పాటు ప్రేమించి సమంతాను పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. ఆ తర్వాత వీరిద్దరికి ఉన్న వ్యక్తిగత కారణాల వలన విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత శోభిత తో పాటు చాలా చోట్ల నాగచైతన్య కనిపించినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. అలానే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటినీ నిజం చేస్తూ వీరిద్దరూ అధికారికంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.

Sobitha Dulipala

- Advertisement -

ఇక ప్రస్తుతం ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్లు బిజీగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్ నుంచి సోబితకు ఒక భారీ ఆఫర్ వచ్చింది. రన్వీర్ సింగ్ నటిస్తున్న డాన్ 3 సినిమాలో శోభితతో ఒక ఐటెం సాంగ్ చేయించాలి అని ప్లాన్ చేస్తుంది అంట దర్శకనిర్మాత ఫర్హానా అక్తర్. అయితే దీని గురించి వీరిద్దరూ చాలాసార్లు కలవనున్నారు. అయితే ఇప్పుడు శోభిత ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే రిజెక్ట్ చేస్తుందా అంటూ ఫిలిం వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఏదేమైనా దీని గురించి అధికారక ప్రకటన త్వరలో వస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు