Double Ismart : హీరోతో ముదిరిన వివాదం… సినిమా రిలీజ్ అయిన వెంటనే పూరీ ప్రెస్ మీట్ ?

Double Ismart : ప్రస్తుతం పూరి తీసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి గానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ఒక వైబ్. ప్రస్తుతం స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న అందరితో కూడా పూరి జగన్నాథ్ పనిచేశారు. వాళ్లకంటూ తన సినిమాతో ఒక సపరేట్ ఆటిట్యూడ్ ను క్రియేట్ చేశారు. ఇంక మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ బాబు కెరియర్ లో పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలతో ఒక కొత్త రకమైన మహేష్ ఆవిష్కరించాడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాలు ఒకప్పుడు ఎంత బాగుండేవో ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఫిలాసఫీ అంత బాగుంటున్నాయి అనేది వాస్తవం. చాలామందికి పూరి జగన్నాథ్ చెప్పే ఫిలాసఫీ చాలా ఇష్టం.

రామ్ తో వివాదం.?

పూరి మాటల్లో చెప్పాలంటే “నేనే రాయడం కాదు, అన్ని కోల్పోయి రోడ్డు మీదకు వచ్చేస్తే ఎవడైనా రాస్తాడు” అని చెబుతూ ఉంటారు. కానీ పూరి జగన్నాథ్ ఇప్పుడు సరిగ్గా రాయట్లేదు అనేది వాస్తవం. అందుకనే వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ కి సక్సెస్ కి ఉన్న డిఫరెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక సినిమా హిట్ అయింది అని అంటే చుట్టూ పదిమంది ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు పట్టుకుని తిరుగుతారు. అదే ఒక సినిమా ప్లాప్ అయితే ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి అడిగే టైపు. పూరి జగన్నాథ్ తన కెరియర్ లో ఎంత సక్సెస్ ని చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ పరిస్థితి వేరు.

అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రామ్… పూరి జగన్నాథ్ ని కంప్లీట్ గా విసిగించాడు అంటూ ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. దీనిలో వాస్తవం ఎంతుంది అంటే చెప్పలేము కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సినిమా 15 రోజుల్లో రిలీజ్ ఉన్నా కూడా సరైన ప్రమోషన్ లేకపోవడంతో నిజమేనేమో అని డౌట్ రాకుండా మానదు.

- Advertisement -

Double Ismart

సెట్ లో చాలా సార్లు వెయిటింగ్

నువ్వొస్తేనే నాకు పని జరుగుద్ది అంటూ వెయిట్ చేసే రకం పూరి జగన్నాథ్ కాదు. పూరి జగన్నాథ్ రాసిన ప్రతి కథను పవన్ కళ్యాణ్ కి ఒకప్పుడు చెప్పేవాడు అప్పుడు పవన్ చేయలేకపోయిన కథలన్నీ రవితేజతో చేశాడు సూపర్ హిట్లు అందుకున్నాడు. అలానే చిరంజీవి ఆటో జానీ వర్కౌట్ కాకపోతే వెంటనే బాలకృష్ణ తో సినిమా చేశాడు. ఇలా ఒకరి కోసం వెయిట్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు పూరీ జగన్నాథ్ అలాంటి పూరి జగన్నాథ్ కూడా చాలాసార్లు సెట్ లో రామ్ కోసం ఎదురు చూశాడు అంటూ కొందరు మాట్లాడుకోవడం విశేషం. పూరి ఒక సినిమాని డైరెక్షన్ చేయడానికి ఎక్కువ రోజులు తీసుకోడు అలా తీసుకున్న సినిమా అంటూ ఏదైనా ఉందా అంటే అది లైగర్. ఇన్ని రోజులు సినిమా చేసిన తర్వాత కూడా ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ రావడంతో మళ్లీ ముందులా డబల్ ఇస్మార్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు.

Ram Pothineni

ఆగస్టు 4న ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆగస్టు 4న రిలీజ్ కానుంది. మామూలుగా పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో సినిమా అంటేనే మంచి హైప్ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న చిత్ర యూనిట్ ఆ హైప్ ని ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు. అయితే హీరో రామ్ విషయంలో పూరి జగన్నాథ్ కంప్లీట్ గా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఎటువంటి హడావిడి లేకుండా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఎలా అయితే రిలీజ్ చేశారు అలానే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే పూరి ఈ సినిమా కోసం ఫేస్ చేసిన ఇబ్బందులను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మీరు మారిపోయారు సార్

అయితే ప్రమోషన్ చేయకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా వాళ్ళని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డబుల్ ఈ స్మార్ట్ శంకర్ సినిమా రైట్స్ ని కూడా నిరంజన్ రెడ్డికి అమ్మేశారు పూరి. అయితే మళ్లీ ఈ సినిమా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు అని మొదలుపెడితే వారందరూ వచ్చి పూరి జగన్నాథ్ గొడవ పెట్టుకునే అవకాశం ఉంది.

అందుకని ఇటువంటి హడావిడి లేకుండా సినిమాను రిలీజ్ చేస్తారేమో అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఈ సినిమాకి సంబంధించి రామ్ కంప్లీట్ గా పూరి జగన్నాథ్ కి సపోర్ట్ చేయలేదు అనేది గట్టిగా వినిపిస్తుంది. అయితే దీని గురించి మీరందరూ కలిసి ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గాని ఒక క్లారిటీ రాదు. ఏదేమైనా ఒకప్పుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి మాకు ప్రస్తావని వస్తే ఖచ్చితంగా పూరి సినిమాలో డైలాగులో అని మీరు మారిపోయారు సార్ అని చెప్పొచ్చు. పూరి ఫెయిల్యూర్ లో ఉండడం బట్టే రామ్ కూడా ఇలా చేసి ఉన్నాడు అని పూరి జగన్నాథ్ అభిమానులు అంటూ వస్తున్నారు.

Double Ismart

రామ్ ఫ్యాన్స్ వెర్షన్

అయితే దీనికి సంబంధించి రామ్ ఫ్యాన్స్ వెర్షన్ కూడా ఒకటి ఉంది. పూరి జగన్నాథ్ ప్లాప్స్ లో ఉన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ కథను రామ్ ఓకే చేశాడు. మళ్లీ పూరి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అలానే పూరి కొడుకు చేసిన రొమాంటిక్ సినిమాలో ఎటువంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఒక సాంగ్ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు రామ్. లైగర్ సినిమా ఫెయిల్ అయిన కూడా మళ్లీ పూరి జగన్నాథ్ కి దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు రామ్. ఈ విషయం కూడా పూరి జగన్నాథ్ గుర్తు పెట్టుకొని ఏమైనా ఉంటే లో లోపల మాట్లాడుకోవాలి తప్ప, బహిరంగంగా ప్రెస్ మీట్ లాంటివి పెట్టకపోతే చాలా మంచిది అని రామ్ ఫ్యాన్స్ అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు