Double Ismart : కాస్ట్లి క్లైమాక్స్… పూరీ జగన్నాథ్ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా?

Double Ismart : హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 2019లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్”మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక ఆ తర్వాత ఒక వైపు రామ్, మరోవైపు పూరీ పలు సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ సక్సెస్ అయితే చూడలేకపోయారు. రామ్ రెడ్, వారియర్, స్కంద సినిమాలు చేసి హ్యాట్రిక్ డిజాస్టర్లను మూట కట్టుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” సినిమాతో పూరి జగన్నాథ్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం బెడిసి కొట్టింది. తాజాగా వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ విషయం గురించి వస్తున్న టాక్ చూస్తుంటే పూరీ “లైగర్” తప్పును రిపీట్ చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

“డబుల్ ఇస్మార్ట్” కోసం పూరి జగన్నాథ్ భారీగా ఖర్చు చేసి రిస్క్ చేస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పూరి జగన్నాథ్ ఏకంగా ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ను ఖర్చు పెడుతున్నారట. “డబుల్ ఇస్మార్ట్” క్లైమాక్స్ గతంలో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “పోకిరి” క్లైమాక్స్ ఫైట్ ను గుర్తు చేస్తుందని అంటున్నారు. ముంబైలో 12 రోజుల పాటు చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ లో రామ్ సరికొత్త అవతార్ లో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాడని అంటున్నారు.

క్లైమాక్స్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా 7.5 కోట్ల బడ్జెట్ తో భారీ సెట్ ను నిర్మించారట. అందులోనే హీరో రామ్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లతో పాటు వందలాది మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో హై యాక్షన్ సీక్వెన్స్ రూపొందించారట. సాధారణంగా పూరి జగన్నాథ్ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అంత ఎక్కువగా ఖర్చు పెట్టడు. సెట్స్ కంటే రియల్ లొకేషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు. కానీ మొదటిసారిగా “డబుల్ ఇస్మార్ట్” కోసం తన ప్లాన్ ను మార్చి రిస్క్ తీసుకుంటున్నారు పూరి.

- Advertisement -

అయితే ఇక్కడే పూరీ “లైగర్” తప్పును రిపీట్ చేస్తున్నాడా? అన్పిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా కోసం కూడా ఇలాగే మైక్ టైసన్ అనే బాక్సర్ ను తీసుకువచ్చి కోట్లు కుమ్మరించాడు. కానీ ఆ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు “డబుల్ ఇస్మార్ట్” కోసం కూడా పూరీ సేమ్ అలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. ఈ మూవీ గురించి పూరి జగన్నాథ్ చేస్తున్న సాహసం ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలంటే మార్చ్ 8 వరకు వెయిట్ చేయక తప్పదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు