Double Ismart Issue : సమస్య పరిష్కారం అనుకుంటే పాకిపోతుందే… ఇప్పుడు నైజం ఒక్కటే కాదు, ఆంధ్ర & సీడెడ్‌లోనూ..

Double Ismart Issue : ఈ ఆగస్టు 15 సినిమాలలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ డబల్ ఇస్మార్ట్ ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఇదివరకే చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడితే వచ్చింది. మొత్తానికి ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ డేట్ కి కూడా ఈ సినిమా వస్తుందో లేదో డౌట్ గా ఉంది కొన్ని పరిణామాలు చూస్తుంటే.

మామూలుగా ఒక సినిమా రిలీజ్ అంటేనే చాలా పగడ్బందీగా ప్రమోషన్ చేస్తుంటుంది పూరీ కనెక్ట్స్ బ్యానర్. ఈ సినిమాకి సంబంధించి కేవలం ట్విట్టర్ లో పోస్టులు తప్ప పెద్ద హడావిడ ఏమి కనిపించట్లేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఆగిపోతుందని తెలుస్తుంది. ఒక బడా ప్రొడక్షన్ హౌస్ మరియు డిస్ట్రిబ్యూషన్ హౌస్ థియేటర్స్ ఇవ్వద్దని లోకల్ లో ఉన్న ఎగ్జిబిటర్స్ కి చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. మామూలుగా ఉన్నట్టు వరకు కేవలం తెలంగాణలో మాత్రమే ఇష్యూ అని చాలామంది అనుకున్నారు ఇప్పుడు ఆంధ్ర మరియు సీడెడ్ లో కూడా ఈ ఇష్యూ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున రిలీజ్ కాబోతున్న మిస్టర్ బచ్చన్ కి ఈ పరిణామాలన్నీ అనుకూలంగా మారడున్నాయి. ఏదేమైనా చిత్ర యూనిట్ వచ్చి అఫీషియల్ గా క్లారిటీ ఇస్తే గాని చాలా విషయాల్లో ఒక అవగాహన రాదు.

Double ISMART

- Advertisement -

ఇకపోతే పూరి జగన్నాథ్ ఎంత పెద్ద టాప్ డైరెక్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం పూరి జగన్నాథ్ కి ఉంది. వాళ్లందరికీ సూపర్ హిట్ సినిమాలు కూడా పూరి జగన్నాథ్ అందించారు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు పూరి సరైన హిట్ సినిమా చేయలేకపోయారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ అంచనాలన్నీ కూడా డబల్ ఇస్మార్ట్ సినిమా పైనే ఉన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూసింది.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును పోగొట్టుకున్నాడు పూరీ జగన్నాథ్. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది సక్సెస్ కొట్టాలంటే నెక్స్ట్ రాబోయే సినిమా హిట్ అవ్వాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు