Double Ismart : రామ్ కు రవితేజ థ్రెట్… డబుల్ ఇస్మార్టే మిస్టర్ బచ్చన్ టార్గెట్

Double Ismart : పుష్ప 2 మూవీ వాయిదా పడడంతో పలు మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా అదే డేట్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే టైంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే అందులో మోస్ట్ అవైటెడ్ మూవీ మాత్రం డబుల్ ఇస్మార్ట్ ఒక్కటే. ఈ మూవీ ప్రస్తుతం ఇటు హీరో రామ్, అటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ లకు అత్యంత ముఖ్యమైనది, కీలకమైనది. ఇంకేముంది పెద్ద సినిమాలేవీ పోటీగా రిలీజ్ కావట్లేదు కాబట్టి డబుల్ ఇస్మార్ట్ కు మంచి ఓపెనింగ్ రావడం పక్కా అని అందరూ నమ్మారు. కానీ తాజాగా రవితేజ నేనున్నాను అంటూ రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

మిస్టర్ బచ్చన్ టార్గెట్ డబుల్ ఇస్మార్ట్

ఆగస్టు 15న రావాల్సిన పుష్ప డిసెంబర్ కి పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ చిన్న సినిమాలకి బెస్ట్ ఆప్షన్ గా మారింది. దీంతో వెంటనే పూరి జగన్నాథ్ ఆ డేట్ పై కర్చీప్ వేశారు. అయితే ఆయన మాత్రమే కాకుండా పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ అనే విక్రం తమిళ మూవీ, నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న ఆయ్, నివేద థామస్ 35 అనే సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. కానీ డబుల్ ఇస్మార్ట్ తో పోలిస్తే ఈ సినిమాలన్నీ చాలా తక్కువ బజ్ తో రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి వాటి ఎఫెక్ట్ ఈ మూవీని ఏ విధంగానూ ఎఫెక్ట్ చేయలేదు. ఇంకేముంది డబుల్ ఇస్మార్ట్ తో పూరి హిట్ కొట్టడం లేదా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అని అనుకుంటుండగా, రవితేజ కూడా అదే డేట్ లో తన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

Buzz: Mr Bachchan to clash with Double Ismart | Latest Telugu cinema news |  Movie reviews | OTT Updates, OTT

- Advertisement -

నష్టం ఎవరికి ?

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాకు మంచి బ్రాండ్ వేల్యూ ఉండడంతో పాటు మిస్టర్ బచ్చన్ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ కావడం మరో ప్లస్ పాయింట్. అయితే కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఇది గట్టి పోటీని ఇస్తుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్న రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో ఎలాగైనా పట్టుదలతో ఉన్నారు. మరి ఒక్కరోజు గ్యాప్ తో డబుల్ ఇస్మార్ట్ ను మిస్టర్ బచ్చన్ టార్గెట్ చేస్తే ఆ క్లాష్ ఎక్కడికి దారి తీస్తుంది? ఎవరికి నష్టం అన్నది చూడాలి. అటు రవితేజకి, ఇటు రామ్ కి ఈ సమయం చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి సమయంలో పోటీ పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్లకే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు