Double Ismart: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీం ఎందుకంత భయపడుతుంది.? జర్నలిస్టులకు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ కూడా లేదా.?

Double Ismart: రీసెంట్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రీసెంట్ గా నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమాకి చాలా అడ్డంకులు ఇప్పటికే ఉన్నాయి అని చెప్పాలి. దీని కారణం పూరీ జగన్నాథ్ తీసిన ముందు సినిమా ఫెయిల్ అవ్వడం. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ లైగర్ అనే ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ ను చూసింది.

ప్రతి దర్శకుడికి ఫెయిల్యూర్ సినిమాలు పడటం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ ఈ ఫెయిల్యూర్ అనేది పూరి జగన్నాద్ ను చాలా డీప్ గా కుదిపేసింది. ఎన్నో అంచనాల మీద వచ్చిన ఈ సినిమా మినిమం కలెక్షన్లు కూడా రాబెట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు పూరి జగన్నాథ్. ఈ సినిమా వలన చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఈ సినిమా తర్వాత పూరి హైదరాబాద్లో ఉండకుండా ముంబై లోనే చాలా రోజులు పాటు ఉండిపోయారు. అయితే ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ధర్నా కూడా దిగే పరిస్థితి వచ్చింది.

Double Ismart

- Advertisement -

అప్పట్లో పూరి జగన్నాథ్ ఆడియో ఒకటి చాలా వైరల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ని ఉద్దేశిస్తూ పూరి మాట్లాడారు. ప్రతి సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలామంది జర్నలిస్టులతో ఆ చిత్ర యూనిట్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్ర యూనిట్ ను జర్నలిస్టులు ప్రశ్నలు అడగకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మామూలుగా ఈ సినిమాకు సంబంధించి ప్రశ్నలతో పాటు పూరి పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలానే డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ, మై హోమ్ ఇష్యూ, రామ్ కి పూరి జగన్నాథ్ కి మధ్య ఉన్న వివాదాలు ఇవన్నీ అడిగే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే అసలు ప్రశ్నలు అడక్కుండా ఉండేటట్లు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు