Game Changer : చరణ్ అభిమానుల్లో అనుమానాలు? అంతా దీని వల్లే?

Game Changer : రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” సినిమా రిలీజ్ లేట్ అవుతున్న కొద్దీ, లేని పోనీ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. రామ్ చరణ్ RRR తర్వాత చేస్తున్న సినిమా కావడంతో చరణ్ అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకంతో పాటు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో తమ హీరో పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టిస్తాడని అంటున్నారు. అయితే మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పటి వరకూ డేట్ ప్రకటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇతర స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతున్నా, వాటి రిలీజ్ డేట్స్ ని ఎప్పటికప్పుడు నిర్మాతలు ప్రకటిస్తూ, అభిమానులని అటెన్షన్ లో ఉంచుతున్నారు. ఇక ఈ సినిమాని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నా, ఇండియన్2 రిలీజ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా శంకర్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చరణ్ అభిమానుల్లో గేమ్ ఛేంజర్ (Game Changer) పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

Doubts among Ram Charan fans on Game Changer

ఇండియన్2 వల్ల చరణ్ ఫ్యాన్స్ లో అనుమానం?

అయితే శంకర్ షణ్ముగం గేమ్ చేంజర్ కొన్నాళ్ళు పక్కన బెట్టి మరీ ఇండియన్2 సినిమాని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నటించిన ఇండియన్2 సినిమాని నెల రోజుల ముందు మొత్తం పూర్తి చేసేసి, ప్రమోషన్ల పనుల్లో ఉన్న శంకర్ తాజాగా ఇండియన్2 ట్రైలర్ ని కూడా రీలిజ్ చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, చరణ్ ఫ్యాన్స్ లో మాత్రం కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇండియన్ 2 సినిమాకి సంబంధించి ఇంతకుముందు వచ్చిన టీజర్ గాని, సాంగ్స్ గాని అంతగా ఆకట్టుకోలేదు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది. పైగా సినిమాలో కమల్ సేనాపతి పాత్ర డిజైన్ కూడా అంత ఆసక్తికరంగా లేదని అంటున్నారు నెటిజన్లు. ఓవరాల్ గా శంకర్ కొత్త మార్క్ మిస్ అయిందన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ట్రైలర్ చూశాక చరణ్ అభిమానుల్లో కూడా కొంత టెన్షన్ తో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి.

- Advertisement -

ఇండియన్2 అటు ఇటైతే ప్రభావం?

ఇక ఇండియన్ 2 ట్రైలర్ చూస్తుంటే కాస్త రొటీన్ గానే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కంటెంట్ స్క్రీన్ ప్లే బాగుంటే తప్ప ఇండియన్2 కి భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమని అంటున్నారు. ఇక ఇండియన్2 పై తమిళనాట అయితే మంచి అంచనాలే ఉండగా, ఇతర రాష్ట్రాల్లో యావరేజ్ రెస్పాన్స్ ఉంది. ఒకవేళ కంటెంట్ అటు ఇటయి నిరాశ పరిస్తే, దాని ప్రభావం గేమ్ చేంజర్ పైనా పడుతుందన్న విషయం తెలిసిందే. అలా అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఓపెనింగ్స్ పై భారీగా ప్రభావం ఉంటుంది. ఏది ఏమైనా గేమ్ చేంజర్ పై అభిమానుల్లో క్లారిటీ రావాలంటే ఇండియన్2 ఫలితం పై ఆధారపడి ఉందని కొంతమంది అభిమానుల మాట. కానీ ట్రేడ్ విశ్లేషకులు మాత్రం రెండు సినిమాలు వేరు వేరు కాన్సెప్ట్స్. అందువల్ల ఒకటి నిరాశ పరిచినా వేరేదానికి కంపారిజన్ అనవసరం అని అంటున్నారు. ఏది ఏమైనా ఇండియన్2 రిలీజ్ అయి శంకర్ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు