Shanmukh: షణ్ముఖ్ సోదరుడు ఇంత నీచుడా.. నిజాలు బయటపెట్టిన డాక్టర్..!

నిన్న అనగా ఫిబ్రవరి 22వ తేదీన ప్రముఖ యూట్యూబర్ , బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒక కేసులో షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ను విచారించడానికి వెళ్లిన పోలీసులకు అనూహ్యంగా షణ్ముఖ్ పట్టుబడడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ కేసును టేకప్ చేసి షణ్ముఖ్ అలాగే ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది..

ఈ మేరకు న్యాయవాది ఒక ట్వీట్ చేస్తూ.. ” షణ్ముఖ్ తండ్రి మాతోనే ఉన్నారు.. మీడియాలో వస్తున్న కథనాలకు.. వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదు.. అన్ని ఆధారాలు పోలీస్ వారికి సమర్పిస్తున్నాము” అంటూ ఆయన తెలిపారు.. అయితే దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ.. “అక్కడ ఏం జరిగింది అని డాడీకి.. నీకు ఎలా తెలుసు.. మీరు అక్కడ లేరు కదా.. రెడ్ హ్యాండెడ్ గా దొరికాక నువ్వు చెప్పేది ఎవరు నమ్ముతారు? బ్రదర్” అంటూ ప్రశ్నించగా.. దానికి సమాధానం కూడా ఇచ్చారు కళ్యాణ్ దిలీప్.. “నేను అతని సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను.. అతని అపార్ట్మెంట్ వీడియోస్ మొత్తం బయటకు తీసాము.. అన్ని వివరాలను కాసేపట్లో పోలీసులే మీకు చెబుతారు.. షణ్ముఖ్ తండ్రి అప్పారావు కూడా ఆఫీసులోనే ఉన్నారు.. అన్ని వివరాలు నాకు ఇచ్చారు.. ఇక షణ్ముఖ్ నాకు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం” అంటూ లాయర్ సమాధానం ఇచ్చారు..

అయితే ఈ విషయాలు వైరల్ అవుతుండగా మరొకవైపు సంపత్ వినయ్ గురించి కొన్ని నిజాలు వెలుగులోకి రావడం ఇప్పుడు అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే సంపత్ వినయ్ ప్రేమించిన అమ్మాయి డాక్టర్ మౌనిక సంపత్ గురించి ఎన్నో నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది..డాక్టర్ మౌనిక అనే యువత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా పేర్కొంది.. ” షణ్ముఖ్ నాకు యూట్యూబ్లో అవకాశం ఇస్తాను అంటూ నన్ను మోసం చేశారు.. అతడి సోదరుడు సంపత్ వినయ్ నాకు 2015 నుండి తెలుసు.. గతంలో సంపత్ తో నాకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.. అందుకే చాలాసార్లు ఇంటిమేట్ కూడా అయ్యాము.. ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు.. మరో ఆరు రోజుల్లో నాతో పెళ్లి పెట్టుకొని.. ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు” అంటూ ఫిర్యాదులో పేర్కొంది..

- Advertisement -

ఇక ఈ ఫిర్యాదు ఆధారంగా సంపత్ వినయ్ ఇంటికి పోలీసులు వెళ్ళగా.. అక్కడ షన్ను మత్తు పదార్థాలు తీసుకుంటూ దొరికిపోయాడు.. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి వేర్వేరు కేసుల్లో బనాయించారు పోలీసులు.. ఇకపోతే ఈ విషయం తెలిసిన అభిమానులు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఇంత నీచుడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి దీనిపై వీరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు