Bholaashankar: చిరు సినిమాకు డీఎస్పీ మ్యూజిక్ – మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు దాదాపు అన్నీ మ్యూజికల్ హిట్స్ అనే చెప్పచ్చు.చిరు సినిమాలకు పని చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రత్యేకంగా ఆయన డ్యాన్స్ ని, స్టైల్ ని దృష్టిలో పెట్టుకొని మ్యూజిక్ కంపోజ్ చేసేవారని చాలా సందర్భాల్లో కోటి, మణిశర్మ లాంటి వారు వెల్లడించారు. మణిశర్మ తర్వాత ఈ మధ్య కాలంలో చిరంజీవితో ఎక్కువ మ్యూజికల్ హిట్స్ ఇచ్చింది మాత్రం డిఎస్పీ అనే చెప్పాలి. చిరు రీఎంట్రీ తర్వాత దేవి సంగీతం అందించిన ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు మినహా మిగతా సినిమాలేవీ మ్యూజికల్ హిట్స్ కాలేదు. రీఎంట్రీ తర్వాత చిరు సినిమాలకు సరైన మ్యూజిక్ లేదన్న లోటు ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.

ప్రస్తుతం భోళాశంకర్ సినిమా మ్యూజిక్ కి కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాని నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త మెగా ఫ్యాన్స్ కి కొంత ఉరతనిస్తోంది. అదేంటంటే, భోళాశంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో చిరంజీవి చేయబోయే సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాని ఈ సినిమాకు దేవి గనక మ్యూజిక్ అందిస్తే చిరు, దేవి కాంబోలో మరొక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.

చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రొటీన్ మాస్ మసాలా రీమేక్ కావటంతో మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇప్పటిదాకా రిలీజైన టీజర్, సాంగ్స్ కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయని ఈ సినిమాకు కేవలం చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, క్రేజ్ మాత్రమే పాజిటివ్ అంశంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు