Dulquer Salmaan : దుల్కర్ దమ్ము ఇక్కడ సరిపోతుందా..? కెరీర్‌ని రిస్క్‌లో పెట్టే పనులెందుకో..

Dulquer Salmaan : ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమాలను ఎంకరేజ్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అందుకే చాలామంది తమిళ నటు సినిమాలు కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ గా ప్రూవ్ అవుతుంటాయి. చాలామంది తమిళ్ హీరోస్ కి అక్కడ దక్కని ఆదరణ కూడా ఇక్కడ దక్కుతుంది అని చెప్పొచ్చు. తమిళ యంగ్ హీరోస్ అయిన సిద్ధార్థ, కార్తీ వంటి హీరోస్ కి తెలుగులో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. అప్పటికే దుల్కర్ చేసిన బెంగళూరు డేస్ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం.

సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. పిరియాడిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని హను తీసిన విధానం. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం. ఇవన్నీ కూడా మంచి ప్లస్ అయ్యాయి. అప్పటికే మహానటి సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి ఉన్నాడు దుల్కర్. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయిపోయాడు. ప్రస్తుతం దుల్కర్ ఇప్పుడు తెలుగు సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. దాదాపు ఒక నాలుగు తెలుగు సినిమాలను చేసే పనిలో పడ్డాడు.

Dulquer Salmaan

- Advertisement -

ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కి వచ్చింది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత రానా దగ్గుబాటి ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయనున్నాడు దుల్కర్. ఆ తరువాత తనను తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిన వైజయంతి బ్యానర్ కి కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యానర్ ఎస్ ఎల్ వి క్రియేషన్స్. ఆ ప్రొడక్షన్స్ లో కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సీతారామం అనే సినిమాని అను అద్భుతంగా డిజైన్ చేయడం వలన బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ అయింది. ఇక ఆ సినిమా వర్కౌట్ అయింది కదా అని తెలుగులో సినిమాలు చేస్తున్నాడా.? లేకుంటే నిజంగానే దుల్కర్ కి కథలు బాగా నచ్చి తెలుగులో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మలయాళం లో దుల్కర్ కి ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా చేసినా కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఇకపోతే వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ కెరియర్ రిస్క్ లో పెడుతున్నాడా అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు