Eesha Rebba : డైరెక్టర్ తో ప్రేమాయణం !

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణలోని వరంగల్ లో  జన్మించిన ఈమె హైదరాబాద్ లో పెరిగారు. 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాతో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా తరువాత మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తరువాత సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. 

ఈ తెలుగు హీరోయిన్ అందంతో పాటు నటనలో కూడా ఏ మాత్రం తీసిపోదనే చెప్పాలి. ఎందుకో ఆమెకు ఇంకా అదృష్టం కలిసి రాలేదు. ముఖ్యంగా ఆమె తెలుగు అమ్మాయి కావడంతోనే అకాశాలు రావడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ముంబై, చెన్నై ప్రాంతాలకు చెందిన వారికి అయితే అవకాశాలు ఆటోమెటిక్ గా వచ్చేవని అభిమానులు పేర్కొంటున్నారు ఆమె అభిమానులు. సినిమాల్లో తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వదలకుండా నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంతో పాటు మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా.. ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈమె ఓ తమిళ డైరెక్టర్ ని ప్రేమించిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయని, త్వరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం ఓ రూమర్  మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు