Ester: బెడ్ రూమ్ లో 3సార్లు కనిపించాడు.. మాజీ భర్త గురించి విస్తు పోయే నిజాలు..!

Ester.. ప్రముఖ సింగర్ నోయల్ (Noel ) మాజీ భార్య ఎస్తేర్ (Ester) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు ఎన్నో సంవత్సరాలపాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లయిన ఏడాదిలోపే విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. విడాకుల అనంతరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా సింగర్ నోయల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత తన భార్య ఎస్తేర్ గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వడమే కాదు ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వల్ల విసిగిపోయానని, ఆమె ఎంతో టార్చర్ చేసింది అంటూ నోయల్ చెప్పుకొచ్చారు.

Ester: He appeared in the bedroom 3 times.. Shocking facts about ex-husband..!
Ester: He appeared in the bedroom 3 times.. Shocking facts about ex-husband..!

నోయల్ దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు..

అయితే దీనిపై స్పందించిన ఎస్తేర్ కూడా అంతే రీతిలో తనదైన స్టైల్ లో తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. నోయల్ క్యారెక్టర్ లెస్ అని , అతడిని ప్రేమించే సమయంలో అతడు చాలా మంచివాడని, కానీ అతడిని అలాంటి కోణంలో ఊహించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా నోయల్ చెప్పే మాటలు అన్నీ కూడా పబ్లిసిటీ కోసమే.. దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాదు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఆ ఇంటర్వ్యూలో కచ్చితంగా నోయల్ తో విడాకులకి ఎస్తేరును కారణం అడుగుతున్నారట అందుకే ఆమె ఎన్నోసార్లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది

ఎక్కడికి వెళ్లినా విడాకుల గురించే ప్రస్తావన..

ఇక ఎస్తేర్ కు సంబంధించిన ఏదైనా సినిమా విడుదలైందంటే చాలు.. ఆ సినిమా ప్రమోషన్స్లో కచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతున్నట్లు ఆమె వాపోయింది. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాను.. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విషయంపైనే అడుగుతున్నారు అంటూ చెప్పిన ఈమె అతడు బాగోతాలను కూడా గుట్టురట్టు చేసింది. ముఖ్యంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ మరొకసారి నోయల్ తో విడాకుల గురించి ఓపెన్ అయ్యింది. అయితే నోయల్ ను 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తేర్ కొన్ని నెలలోనే విడాకులు ఇచ్చేసిందట. పెళ్లైన 16 రోజులకే అతడి నుంచి దూరంగా వచ్చేసానంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

పెళ్లయిన ఏడాదిలోపే విడాకులు..

నిజానికి వీరిద్దరి వివాహం జరిగిన ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది పెళ్లికి సంబంధించిన ఎన్నో పనులు సిద్ధం చేసి.. పెళ్లి రేపు జరుగుతుందనగా ఏదైనా విషయం బయటపడితే పెళ్లి తర్వాత చూసుకుందాంలే అని ఆలోచిస్తారు. పెళ్లి తర్వాతే ఏదైనా తప్పు చేస్తే ఒకసారి కదా క్షమిద్దామనుకుంటారు. కానీ పదే పదే చేస్తే మాత్రం అతడి నుంచి లేదా ఆమె నుంచి విడిపోవడమే మంచిది అంటూ ఆమె తెలిపింది. ముఖ్యంగా తన భర్త రెడ్ హ్యాండెడ్గా ఏకంగా మూడుసార్లు బెడ్రూంలో ఇంకొక అమ్మాయితో దొరికారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎస్తేర్ . ఈ కారణంగానే తన భర్త నుంచి తాను బయటకు వచ్చేసానని, అతడు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు