F4 Update : తెరపైకి బ్లాక్ బస్టర్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సీక్వెల్… ఎఫ్4కి సన్నాహాలు

F4 Update : విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే బ్లాక్ బస్టర్ మూవీ ఫ్రాంచైజీలో నెక్స్ట్ పార్ట్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

తెరపైకి ఎఫ్ 4

గతంలో ఎఫ్ 2 ఫ్రాంచైజీలో రెండు సినిమాలతో అదరగొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి కొత్త సీక్వెల్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు గతంలో ఎఫ్2 అండ్ ఎఫ్ 3 సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఈ ప్రాజెక్టుకు కూడా మళ్లీ నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతునట్టుగా సమాచారం. ఇక ఎఫ్ 4లో కూడా వెంకటేష్ దగ్గుబాటితో పాటు వరుణ్ తేజ్ హీరోలుగా నటించబోతున్నారనీ తెలుస్తోంది. మరి ఈసారి కూడా హీరోయిన్లను రిపీట్ చేస్తారా? లేదంటే కొత్త హీరోయిన్లతో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూడవ పార్ట్ ని తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Varun Tej: Venkatesh, Varun Tej starrer F3 to not release on OTT before 8  weeks of theatrical run, South News | Zoom TV

- Advertisement -

మ్యాజికల్ కాంబో రిపీట్

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019లో రూపొందిన ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా పేలింది. ఈ సినిమాలోని ఫన్ కడుపుబ్బా నవ్వించగా, ఫ్రస్టేషన్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో తమన్నాతో పాటు మెహరీన్ ఫిర్జాద కథానాయికలుగా నటించారు. పెళ్లయిన తర్వాత ఇంట్లో నెలకొనే సాధారణ పరిస్థితిని కామెడీగా తీర్చిదిద్దారు అనిల్ రావిపూడి. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. దీంతో 2022లో ఎఫ్3 అంటూ సీక్వెల్ తో సందడి చేశారు. అయితే ఫస్ట్ పార్ట్ ఆకట్టుకున్నంతగా సెకండ్ పార్ట్ పెద్దగా హిట్ అవ్వలేదు. మరి ఇప్పుడు రాబోతున్న ఎఫ్ 4 ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

ఇద్దరు స్టార్స్ కు ఈ మూవీ ముఖ్యమే

కాగా వెంకటేష్ చివరిసారిగా 2024 లో రిలీజ్ అయిన సైంధవ్ అనే సినిమాలో కనిపించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. మరోవైపు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో చివరిసారిగా కనిపించాడు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చే సినిమా ఒకటి పడడం చాలా ఇంపార్టెంట్. అందుకే మరోసారి తమకు కలిసి వచ్చిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో హిట్ అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ ఇద్దరు స్టార్స్. రీసెంట్ టైమ్స్ లో వీరిద్దరి ట్రాక్ రికార్డులు గమనిస్తే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీనే కాస్త ఊరట నిచ్చింది. అందుకే మరోసారి ఇదే కాన్సెప్ట్ ను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు వెంకీ, వరుణ్. మరి ఈ మూవీ అనుకున్నట్టుగా ఈ ఇద్దరు స్టార్స్ కు హిట్ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు