Fahadh Faasil : దృశ్యం దర్శకుడితో ‘ఫాఫా’ సినిమా.. ఆ ఫ్రాంచైజెస్లో భాగమే!

Fahadh Faasil : మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విలక్షణ నటుడుగా, హీరోగా ఒక్క మళయాళంలోనే కాకుండా తమిళ్, తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. “ఫాఫా” అంటూ అభిమానుల చేత పిలిపించుకునే ఫహద్ ఫాజిల్ వరుస సినిమాల విజయాలతో ఊపు మీదున్నాడు. ఇక ఫహద్ ఫాజిల్ రీసెంట్ గా “ఆవేశం” సినిమా బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ కామెడీ మూవీ వరల్డ్ వైడ్ గా పలు రికార్డులను బద్దలు కొట్టి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు చేసి, ఫహద్ ఫాజిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం పుష్ప: ది రూల్‌ లో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ SP గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో పుష్ప చేతిలో అవమానానికి గురై రెండో పార్ట్ లో రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఫహద్ ఫాజిల్ నుండి తాజాగా మరో క్రేజీ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.

జీతూ జోసెఫ్ తో ఫాఫా కాంబో..

మలయాళంలో దృశ్యం సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన దర్శకుడు జీతూ జోసెఫ్. ఆ సినిమా తెలుగు, తమిళ, కన్నడ తో పాటు హిందీలో కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే కాక ఓజం, నేరు వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. ఇక ఇప్పుడు ఫహద్ ఫాజిల్ జీతూ జోసెఫ్ తో సినిమా చేయనున్నట్టు కంఫర్మ్ అయింది. కొన్ని రోజుల నుండే వీరి కాంబోలో సినిమా వస్తున్నట్టు వార్తలు రాగా, తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ చేసి కంఫర్మ్ చేసారు. ఇక ‘E4 ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా, దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ ప్రాజెక్ట్‌ కి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ కాంబోలో మూవీ అనౌన్స్ కాగానే మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా సినిమా గురించి ఎదురుచూస్తున్నారు.

Fahadh Faasil collabarate with jeethu joseph upcoming movie

- Advertisement -

సూపర్ హిట్ నేరు ఫ్రాంచైజీ లో..

ఇక ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) జీతూ జోసెఫ్ కాంబోలో రాబోయే చిత్రం యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓరియెంటెడ్ గా తెరకెక్కనుందని సమాచారం. ఇక జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన లాస్ట్ మూవీ “నెరు” ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక, థియేటర్ల వద్ద విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని తరువాత, జీతూ మళ్లీ మోహన్‌లాల్‌ తో ‘రామ్: పార్ట్ వన్’ పేరుతో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోవిడ్ కారణంగా ప్రొడక్షన్ ఆలస్యం అయింది. ఇది లైన్లో ఉండగానే జీతూ జోసెఫ్ తో మూవీ అనౌన్స్ కాగా, ఈ మూవీ నెరు మూవీ కాన్సెప్ట్ ఫ్రాంచైజ్స్ లో భాగంగానే తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఫహద్ మరియు జీతూ జోసెఫ్‌ల కలయికలో మొదటి సినిమా కాగా, శాంతి మాయాదేవి ఈ సినిమాకు స్క్రిప్ట్‌ రాస్తున్నారు. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు