Family Star : సంక్రాంతికే రావాలా ఏంటి.?

యువత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్. ఆ సినిమా తర్వాత చేసిన సోలో సినిమా పరశురాంకి అద్భుతమైన పేరుని తీసుకొచ్చింది. అయితే పరశురామ్ ఒక సినిమాను త్వరగా తెరకెక్కించడంలోనూ, అలానే అద్భుతమైన మాటలు రాయటం లోను దిట్ట అని చెప్పొచ్చు. ఎందుకంటే పరశురామ్ కూడా పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన వాడే కాబట్టి. ఒక సినిమాను ఫాస్ట్ గా తెరకెక్కించడంలో ముందు ఉంటాడు.

రీసెంట్ గా పరశురామ్ చేసిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. మహేష్ అభిమానులకు ఈ సినిమాలో కొన్ని సీన్స్ మంచి ట్రీట్ లా అనిపించాయి. ఇకపోతే పరశురామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ కెరియర్లో అద్భుతమైన హిట్ సినిమా ఏది అంటే టక్కును గుర్తొచ్చేది గీతగోవిందం. ఎందుకంటే ఆ సినిమా దాదాపు 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మళ్ళీ అదే కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి .

రీసెంట్ టైమ్స్ లో విజయ్ దేవరకొండ కి కూడా అనుకున్న విజయాలు వరించలేదు. ఎన్నో అంచనాలతో చేసిన ప్రతి సినిమా కూడా కొంతమేరకు నిరాశనే మిగిల్చింది. అయితే ప్రస్తుతం విజయ దేవరకొండ చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఎప్పుడు సంక్రాంతికి తన బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకునే దిల్ రాజు. ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించడానికి ప్లాన్ చేశారు.

- Advertisement -

అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా సాంగ్స్ కొన్ని పూర్తి కాలేదు. హడావిడిగా షూట్ చేసినా కూడా ఈ సినిమాని సంక్రాంతి బరిలో ఉంచడం కష్టమని తెలుస్తుంది. అలానే సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రానున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతి నుంచి దిల్ రాజు తప్పుకున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. అదే డైలాగు వెర్షన్ లో ఇప్పుడు “సంక్రాంతికే రావాలా ఏంటి” అనే రేంజ్ లో చిన్నగా ట్రోల్స్ మొదలయ్యాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు