Family Star : కొండన్న స్టెప్పులపై నెటిజన్ల కామెంట్స్..

టాలీవుడ్ యాంగ్రీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వం లో “ఫ్యామిలీ స్టార్” సినిమాలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉండగా పోటీ వల్ల సమ్మర్ కి షిఫ్ట్ అయింది. ఇక విజయ్ పరశురామ్ కాంబో లో ఇంతకు ముందే వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికితోడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకుంది.

ఇదిలా ఉండగా ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి లేటెస్ట్ గా ‘నందనందనా’ అంటూ ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ గా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ఈ పాటలో కొండన్న విజయ్ వేసిన స్టెప్పులు మాత్రం అప్పుడే ట్రోలర్లకి బూస్టప్ గా మారాయి. పాటలో విజయ్ దేవరకొండ తన జుట్టు తడుముకుంటూ మాటి మాటికీ వేస్తున్న ఆ స్టెప్ చూడ్డానికి తలపై షాంపూ పెట్టుకుంటున్నట్టుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ కామెంట్స్ చూసిన మీమర్స్ ఏకంగా పలు షాంపూ ల పేర్లతో యాడ్ వీడియో లాగా కట్ చేసి సాంగ్ ని నెట్టింట వైరల్ చేసి పడేసారు. ఏది ఏమైనా సాంగ్ మాత్రం జనాల్లోకి వెళ్తుంది. గతంలో ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ అయినపుడు కూడా, టీజర్ లో ఐరనే వంచాలా ఏంటి? అనే డైలాగ్ కూడా ముందు ఇలాగే ట్రోలింగ్ అయింది. ఆ తర్వాత ఆ డైలాగే సినిమాకు ప్రమోట్ అయింది. ఇప్పుడు ఈ పాట కూడా అదే రకంగా సినిమా ప్రమోషన్ కి హెల్ప్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు