Prashant Varma : గందరగోళం… అయోమయం… ఒక హిట్‌కే ఇలా అయితే ఎలా డైరెక్టర్ గారు..?

Prashant Varma : ఈ ఏడాది సంక్రాంతికి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమాల్లో హనుమాన్ ( Hanu Man ) కూడా ఒకటి.. వంద రెండు వందలు కాదు ఈ సినిమా ఏకంగా రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’పైనే ఉంది.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పటివరకు షూటింగ్ ను మొదలు పెట్టినట్లు కనిపించలేదు..ఆ సినిమా కన్నా ముందు అనుపమ మూవీని పూర్తి చేస్తున్నా అన్నాడు. దాని గురించి అప్డేట్ ఇవ్వలేదు. బాలీవుడ్ హీరోతో ఓ సినిమా అన్నాడు. మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మరో కొత్త సినిమా అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ (Prashant Varma ) హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ( Jai Hanuman ) సినిమా రాబోతుందని వచ్చే ఏడాది అని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఈ సినిమా కు సంబందించిన హనుమాన్ జయంతి సందర్బంగా స్క్రిప్ట్ పూర్తి అయ్యినట్లు ఒక అప్డేట్ ను అలా వదిలారు. దాన్ని చూసిన ఫ్యాన్స్ సంతోషంతో ఎగిరి గంతేశారు. కానీ ఆ ఆనందం ఆవిరైంది. ఆ ప్రాజెక్టు ను పక్కన పెట్టిన ప్రశాంత్ అనుపమ పరమేశ్వరన్ ఆక్టోపస్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తి అయినట్లు తెలుస్తుంది.. ఆ సినిమాను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు.. అయితే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హీరో రణవీర్ తో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు గతంలో బాగా వైరల్ అయ్యాయి.. ఈ సినిమాలు పూర్తి అవ్వలేదు కానీ ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ తో సినిమాను అనౌన్స్ చేసారు.. కానీ ఆ సినిమా అప్డేట్ అయితే ఇవ్వలేదు..

Fans fire on director Prashant Varma for not giving Jai Hanuman update
Fans fire on director Prashant Varma for not giving Jai Hanuman update

జై హనుమాన్ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.. అసలు ప్రీ ప్రోడక్షన్ పనులను కూడా మొదలు పెట్టలేదనే టాక్ వినిపిస్తుంది.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడా అని సినీ లవర్స్ తెగ వెతికేస్తున్నారు.. మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ సినిమా పై మాత్రం అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి.. రాముడు, హనుమంతుడు పాత్రలకు స్టార్ హీరోలు దొరికే వరకు నిరీక్షణ తప్పదు. బాలీవుడ్ రామాయణంలో చేస్తున్న నటులను రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రశాంత్ వర్మ మీద ఉంది. స్టార్ క్యాస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న ఈ దర్శకుడు ముందైతే ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకోబోతున్నాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకొనే స్థితిలో లేడు.. మరి ఎప్పుడు అప్డేట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నాడు.. ఒక్క సినిమా కూడా పూర్తి చెయ్యలేదు కానీ కొత్త సినిమాలు మాత్రం అనౌన్స్ చేస్తున్నాడు. మరి ఈ గంధరగోళం ఏంటి అని హనుమాన్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు..ఒక హిట్‌కే ఇలా అయితే ఎలా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు