Mr Bacchan : షూటింగ్ ఇంకా అవ్వలేదు .. రవితేజ ఫ్యాన్స్ ఫైర్ ..

Mr Bacchan : టాలీవుడ్ స్టార్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్.. గత కొన్ని సినిమాలు చూస్తే రవితేజ వరుసగా డిజాస్టర్లు ఇస్తున్నారు. అందువలన మార్కెట్ పూర్తిగా పడిపోయింది.. ఇప్పుడు మార్కెట్ ను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో రవితేజ మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఆ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన సాంగ్ జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు..

సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ డేట్ ను అనౌన్స్ చెయ్యడం పై రవితేజ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.. ఆగస్టు 14 న ప్రీమియర్ షో, 29 న ఓటీటీ, సెప్టెంబర్ 6 న నెట్ఫ్లిక్స్ లో రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఇకపోతే ఈ సినిమాలో టాకి పార్ట్ పూర్తయిన కూడా రెండు పాటల చిత్రీకరణ ఇంకా పెండింగ్ ఉందనే వార్త తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. మరి కేవలం పది రోజులు ఉండటంతో ఎలా పూర్తి అవుతాయి.. మళ్లీ సినిమాను హరీష్ శంకర్ పోస్ట్ పోన్ చేస్తాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి దీనిపై మిస్టర్ బచ్చన్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Fans fire on Harish that Mr. Bachchan's shooting is pending
Fans fire on Harish that Mr. Bachchan’s shooting is pending

ఇకపోతే ఈ సినిమాకు మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది.. సినిమా కోసం రవి తేజ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నిర్మాతలు ముందుగా సింగల్ కాపీని సేల్ కింద అమ్మాలని అనుకున్నారు. రూ.35 కోట్ల దగ్గర రేటు కోట్‌ చేశారు. అయితే బయ్యర్ల నుంచి బేరాలు మొదలయ్యాయి.. ఏరియాల పరంగా చూస్తే మంచి బిజినెస్ డీల్ నడించింది.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బిజినెస్ డీటెయిల్స్ బాగానే జరిగినట్లు ఇండస్ట్రీలో టాక్.. మరి సినిమాను అనుకున్న టైంలో హరీష్ శంకర్ రిలీజ్ చేస్తాడో లేక పోస్ట్ పోన్ చేస్తాడో అన్నది ఆసక్తిగా మారింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు