Rebel Star: ప్రభాస్ ముందు పెద్ద డిమాండ్ పెట్టిన ఫ్యాన్స్ – వర్కౌట్ అవుతుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గతంలో నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్ తో టీజర్ వదిలి తీవ్ర విమర్శలకు గురైన దర్శకుడు ఓం రౌత్, వాటిని సరిదిద్ది ట్రైలర్ ని గ్రాండ్ తీర్చిదిద్దటంతో అప్పుడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఆసక్తికర డిమాండ్ తో ముందుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆదిపురుష్ సినిమా మీదకంటే కూడా ఎక్కువ అంచనాలు సలార్ సినిమా మీదనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో జూన్ 16న రిలీజ్ కానున్న ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ సినిమా షూటింగ్ మొదలైంది అన్న అప్డేట్ తప్ప, ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు సినిమా యూనిట్. దీంతో అసహనంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ డిమాండ్ తో సలార్ సినిమా యూనిట్ పై ఒత్తిడి తెస్తున్నారు.

ప్రభాస్ తీసుకొచ్చిన డిమాండ్ వాస్తవానికి మంచిదనే చెప్పాలి, గతంలో కూడా బాహుబలి2 సినిమాతో పాటుగా సాహో సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే సాహో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి, డార్లింగ్ ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్ ని పరిగణలోకి తీసుకొని ఆదిపురుష్ సినిమాతో పాటుగా సలార్ టీజర్ ని రిలీజ్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు