Game Changer : షూటింగ్ ఏమో జరుగుతూనే ఉంది.. రిలీజ్ డేట్ మాత్రం చెప్పరు?

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీల్లో “గేమ్ ఛేంజర్”. ఈ సినిమాను శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మళ్ళీ ఏ అప్డేట్ కూడా రాలేదు. కానీ సినిమాల నుండి మాత్రం లీకులు అవుతూనే ఉన్నాయి. ఇక లాస్ట్ ఇయర్ దీపావళికే సినిమా నుండి ఓ పాట రిలీజ్ కావాల్సి ఉండగా దాన్ని కూడా ఏవో టెక్నికల్ ఇష్యూస్ చెప్పి వాయిదా వేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్ లావణ్య పిల్లి హడావిడి లో ఈ సినిమా షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ పడగా, ఈ ఇయర్ సంక్రాంతి ఇంకా లేటెస్ట్ గా చిరుకి పద్మవిభూషణ్ వచ్చిన కారణంగా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. అయితే రామ్ చరణ్ లేకున్నా కొన్ని సార్లు శంకర్ టెక్నికల్ వర్క్ కి సంబంధించిన వర్క్స్ చూసుకునే వారు. ఇక లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్ ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్ లో మొదలవుతుందని సమాచారం వచ్చింది. ఫిబ్రవరి మొదటివారంలో ఆల్రెడీ ఒక వారం షూటింగ్ చేసిన చిత్ర యూనిట్ పెద్దగా గ్యాప్ లేకుండా షూటింగ్ జరపడం మంచిదేనని చెప్పాలి.

కానీ ఫ్యాన్స్ మాత్రం చిత్ర యూనిట్ పట్ల చాలా అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ తర్వాత మొదలైన పలు పెద్ద సినిమాలు కూడా వేగంగా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కూడా అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ తర్వాత దేవర లాంటి సినిమాల మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ని ఎప్పుడో ప్రకటించారు. కానీ దిల్ రాజు మాత్రం షూటింగ్ జరుగుతుందా లేదా చూస్తున్నాడు గాని రిలీజ్ అప్డేట్ ఇద్దామని ఆలోచనలో ఉన్నడా లేడా అని నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కనీసం ఈ ఫిబ్రవరిలోనైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ ఇస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు