Game Changer : శంకర్ చెప్పిన ఆ మాటలు నిజమవ్వాలి… చరణ్ ఫ్యాన్స్ ప్రార్థనలు

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ దాదాపుగా మూడేళ్ల నుంచి జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కనీసం మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా క్లారిటీ లేదు. అయితే ఇప్పటిదాకా ఈ మూవీకి భారతీయుడు సీక్వెల్ అడ్డుగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయితే ఆ అడ్డు తొలగడంతో పాటు, గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో కూడా ఒక క్లారిటీ వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూసారు మెగా ఫ్యాన్స్. ఆ ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. జూలై 12న భారతీయుడు 2 పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉంది? దీన్ని చూసాక శంకర్ మాటలు గేమ్ ఛేంజర్ విషయంలో నిజం కావాలని మెగా ఫాన్స్ ఎందుకు ప్రార్థిస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే…

భారతీయుడు ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ పై..

శంకర్ షణ్ముగం ఇండియన్ డైరెక్టర్స్ లో మంచి విజనరీ ఉన్న డైరెక్టర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెరపై ఆయన చూపించే విజువల్స్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తాయి. కానీ ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందడానికి కూడా కష్టపడాల్సి వస్తోంది. అందులో ఈరోజు రిలీజ్ అయిన కమల్ హాసన్ భారతీయుడు 2 కూడా ఒకటి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి చాలామంది ఇది శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మూవీనే ఇలా ఉందంటే గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటోనని తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో శంకర్ చెప్పిన మాటలే నిజం కావాలని మెగా ఫాన్స్ ప్రార్థిస్తున్నారు.

Fans Decode Plot Of Ram Charan's Game Changer With Kiara; Directed By S  Shankarగేమ్ ఛేంజర్ గురించి మెగా ఫ్యాన్స్ ప్రార్థనలు

గతంలో ఓ సందర్భంలో శంకర్ మాట్లాడుతూ ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తే మాట వస్తుందని ఎక్స్ట్రా పని చేసాము. సినిమాల కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాము. మంచి అవుట్ పుట్ రావాలని చేయాల్సిన దానికంటే ఎక్కువ గంటలే పని చేసాము అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమా బాగుంటుందని భరోసా ఇచ్చేలా మంచి మంచి ఎక్స్పర్ట్స్ ను ఇందులో ఇన్వాల్వ్ చేశామని క్లారిటీ ఇచ్చాడు. అలాగే మంచి అవుట్ పుట్ వచ్చింది మీరు డైరెక్ట్ గా థియేటర్లో సినిమాని చూడండి అంటూ ఆడియన్స్ కు ధైర్యం ఇచ్చాడు. అయితే శంకర్ చెప్పిన ఈ మాటల ఎఫెక్ట్ భారతీయుడు 2లో ఏమాత్రం కనిపించలేదు.

- Advertisement -

ఆల్మోస్ట్ ఆయన భారతీయుడు 2 విషయంలో ఫెయిల్ అయినట్టే. కానీ భారతీయుడు 3 విషయంలో ఈ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా శంకర్ చెప్పిన మాటలు ఫెయిల్ అవ్వద్దని చరణ్ ఫాన్స్ ప్రార్థిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫైనల్ అవుట్ పుట్ చూసాకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే శంకర్ వెల్లడించారు. మరి ఈ ఏడాది డిసెంబర్లో గేమ్ ఛేంజర్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు