Game Changer Release Date : గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్… అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?

Game Changer Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చాలాకాలంగా షూటింగ్ దశలోనే ఉంది. పైగా ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయకపోవడంపై మెగా ఫాన్స్ అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం మేరకు మెగా అభిమానులకు తీపి కబురు అందబోతోంది. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మరి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్మెంట్ రాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు అంటే…

ఎప్పుడెప్పుడా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే ముహూర్తం రానే వచ్చింది. నిజానికి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ నెలకొంది. కొంతమంది అక్టోబర్లో రిలీజ్ చేస్తారు అంటే మరి కొంతమంది డిసెంబర్లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే అక్టోబర్ అనే వాదన ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ టైంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు అక్టోబర్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోకపోవడం, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో డిసెంబర్లోనే గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రాబోతోందని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఆ ప్రచారమే నిజం కాబోతోంది. అక్టోబర్లో కాకుండా డిసెంబర్లో గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇండియన్ 2 వేదికపైనే ఇవ్వబోతున్నారు.

Date locked for the revelation of Game Changer release

- Advertisement -

మరికొన్ని గంటల్లో అనౌన్స్మెంట్

జూలై 12న రిలీజ్ కాబోతున్న ఇండియన్ 2 మూవీకి కూడా శంకరే దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలను ఒకేసారి తీయడంతో గేమ్ ఛేంజర్ మాత్రం ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇండియన్ 2 వచ్చే శుక్రవారం తెరపైకి రాబోతోంది. ఇప్పటికే తమిళంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఓ రేంజ్ లో నడుస్తుండగా, తెలుగులో భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే జూలై 7న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో భారతీయుడు 2 మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇదే వేదికపై గేమ్ ఛేంజర్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తానికి మరికొన్ని గంటల్లో మెగా ఫాన్స్ కు శుభవార్త అందబోతోంది. కాగా మరోవైపు మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తాజాగా రాంచరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్ ఇంకెన్ని రోజులు ఉంది ? ఎప్పుడు పూర్తవుతుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఇండియన్ 2 వేదికపై గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఇంకేమైనా సర్ప్రైజ్ ఇస్తారా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు