Ramcharan: ఆరోజు రిలీజ్ చేసేది లీక్డ్ సాంగ్ ఆ..? లేక కొత్త సాంగ్ ఆ?

 

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో “గేమ్ ఛేంజర్” ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఇండియన్ జేమ్స్ క్యామెరూన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో మూడేళ్ళ కిందట షురూ అయిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. వన్ ఇయర్ కిందట 2023 సమ్మర్ కి రిలీజ్ కన్ఫర్మ్ అనుకున్న గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమా వల్ల 2024 సమ్మర్ కి పోస్టుపోన్ అయ్యింది.

అటు శంకర్ కూడా ఇండియన్2 తీస్తూనే, గ్యాప్ వచ్చినప్పుడు గేమ్ ఛేంజర్ కూడా షూట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ నుండి కొన్ని రోజుల కిందట ‘జరగండి జరగండి’ అంటూ ఒక సాంగ్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ మ్యూజిక్ పరంగా ఒకే అనిపించుకున్నా, లిరిక్స్ పరంగా ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యింది. గతంలో స్పైడర్ సినిమాలో పుచ్చకాయ సాంగ్ ని ట్రోల్ చేసినట్టు, సోషల్ మీడియా మీమర్స్ దాన్ని మించి ఈ సాంగ్ ని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే మూవీ మేకర్స్ వెంటనే అప్రమత్తమై సామజిక మాధ్యమాల నుండి సాంగ్ తొలగించి, సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడం జరిగింది.

అయితే తాజాగా ఈ దసరా రోజు గేమ్ ఛేంజర్ నుండి ఓ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మేకర్స్ నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు గాని, ఫ్యాన్స్ మాత్రం ట్రెండ్ చేస్తున్నారు. ఒక వేళ ఇది నిజమైతే అది ఏ సాంగా అని ఆలోచిస్తున్నారు.

అయితే ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం లీక్ అయిన ‘జరగండి’ సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయింది కాబట్టి, ఆ పాటని సోషల్ మీడియా లో ఎన్ని సార్లు మేకర్స్ డిలీట్ చేయించినా, మళ్ళీ వస్తుంది. కాబట్టి అదేదో అఫిషియల్ గా రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు కూడా భావిస్తున్నారు. మరి మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో తెలియాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు