Genelia: ఆ హీరో చేతుల్లో దారుణంగా మోసపోయిన జెనీలియా..?

Genelia.. పాల బుగ్గల సుందరి జెనీలియా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అచ్చం మన పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు అతి తక్కువ సమయంలోనే కనెక్ట్ అయిపోయి, ఈమెను ఓన్ చేసుకున్నారు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే హవభావాలను పలికించగల సామర్థ్యం కలిగిన ఈ బ్యూటీ, తన నటనతో, అందచందాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా జెనీలియా చలాకీతనానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోయింది. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా పాత్రకి మరింతగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్..

Genelia: Genelia who was badly cheated in the hands of that hero..?
Genelia: Genelia who was badly cheated in the hands of that hero..?

వివాహం తర్వాత ముంబైలో సెట్ అయిన జెనీలియా..

ఆ తర్వాత ఈమె నటించిన ఎన్నో సినిమాలు ఈమెకు మంచి గుర్తింపును అందించాయి. అలా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిన జెనీలియా, ఆ తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత విలాస్ రావు దేశ్ ముఖ్ వారసుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇద్దరు అబ్బాయిలకు కూడా జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. 2013లో వివాహాం అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ముంబైలో సెటిల్ అయిపోయింది . అక్కడే వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రేమ పేరుతో పెళ్లికి ముందే దారుణంగా మోసపోయిన జెనీలియా..

ఇదిలా ఉండగా పెళ్లికి ముందే ఒక స్టార్ హీరో కొడుకుతో చాలా క్లోజ్ గా ఉండేదని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య చనువు చూసి ఏకంగా పెళ్లి కూడా చేసుకుంటారని ఆడియన్స్ అనుకున్నారు.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ స్టార్ హీరో కొడుకు చెంప చెల్లుమనిపించింది జెనీలియా. అతడు మిస్ బిహేవ్ చేసినట్లు సమాచారం. ప్రేమ పేరుతో ఆమెను వాడుకోవాలని చూశారట అందుకే మోసపోయానని తెలుసుకున్న జెనీలియా అతడి నుంచి దూరం జరిగింది. ఇక ఆ తర్వాత ఇదే ప్రభావంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమెకు క్రమంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇకపోతే అప్పట్లో ఈమె లవ్ ట్రాక్ మాత్రం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.

- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జెనీలియా..

ఇక జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మళ్లీ రియంట్రీ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు కావడంతో ఖాళీగా ఉండలేక మళ్ళీ రియంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా కిరీటి సినిమాలో కీలకపాత్రలో అవకాశాన్ని దక్కించుకుంది. ఏది ఏమైనా జెనీలియా ఒక స్టార్ హీరో కొడుకు చేతిలో మోసపోయింది అని తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిరీటి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా ఈ సినిమాతో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు