Suriya : తెర‌పైకి సీక్వెల్‌

ఏ.ఆర్‌.మురుగ‌దాస్ కేవ‌లం త‌మిళం చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.. తెలుగులో కూడా ఆయ‌న‌కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ తెర‌కెక్కిన గ‌జిని సినిమా అంద‌రికీ గుర్తే ఉంటుంది. ఈ గ‌జిని సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇందులో సూర్య పాత్ర అద్భుత‌మ‌నే చెప్పాలి. సూర్య కెరీర్‌లో ఇది ఒక సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. సూర్య న‌ట‌న‌కు ఈ సినిమా ద్వారా చాలా మంది అభిమానులు అయ్యార‌నే చెప్పాలి.

అయితే గ‌త కొంత‌కాలంగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ నుంచి ఫ్యాన్స్ ఆశించిన రేంజ్‌లో సినిమాలు రావ‌డం లేదు. చివ‌ర‌గా ర‌జినికాంత్‌తో తీసిన ద‌ర్బార్ సినిమా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావ‌డానికి త‌న‌ను స్టార్ ద‌ర్శ‌కునిగా దేశానికి ప‌రిచ‌యం చేసుకోవ‌డం కోసం సినిమా తీస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇంత‌కు ఆ సినిమా ఏంటంటే.. హీరో సూర్య కెరీర్ లో బిగ్ హిట్‌గా నిలిచిన గ‌జిని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నార‌ట ముర‌గ‌దాస్‌. ఈ విష‌యంపై సూర్య‌తో ముర‌గ‌దాస్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే హీరో సూర్య ఫ్యాన్స్‌తో పాటు అమీర్‌ఖాన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ కుషి అవుతారు. గ‌జిని సినిమా హిందీలో అమీర్‌ఖాన్ న‌టించారు. బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఎక్కువ‌గా సౌత్ కంటెంట్‌నే ఇష్ట‌ప‌డుతున్నారు. ఒక‌వేళ త‌మిళంలో గ‌జిని 2 ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కితే అమీర్‌ఖాన్ కూడా రెండో పార్ట్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు అల్లు అర‌వింద్‌ గ‌జిని 2 సినిమా టైటిల్‌ని రెండేళ్ల కింద‌టే రిజిస్టర్ చేయించార‌ట‌. గ‌జిని 2 ని గీతాఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా  నిర్మించ‌బోతున్నాయ‌ని వార్త‌లు వినిపించాయి. చూడాలి మ‌రీ ఏం జ‌రుగుతుంద‌నేది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు