Balakrishna: మోక్షజ్ఞ కోసం గ్లోబల్ డైరెక్టర్.. బాలయ్య ప్లాన్ అదుర్స్..!

Balakrishna: గ్లోబల్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రాజమౌళి.. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే అయినా అసలు ఫ్లాప్ అంటూ చవిచూడని ఏకైక డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఎంతోమంది స్టార్ హీరోలకు గ్లోబల్ స్టేటస్ అందించిన ఘనత ఈయనకే సాధ్యం. ఇకపోతే ఇప్పటికే చాలామంది హీరోలు తమ వారసులను రాజమౌళి ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు. కానీ రాజమౌళి ఈ విషయంపై కాస్త ఆలోచిస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కోసం ఏకంగా రాజమౌళినే సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఎంత క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. యంగ్ హీరోలకి కూడా పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ .. హ్యార్ట్రిక్ విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు తెరపై కనిపిస్తాడు? ఎప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవాలని? నందమూరి అభిమానులు తెగ ఎదురుచూస్తున్న తరుణంలో ఈ నందమూరి అభిమానులకు సోషల్ మీడియాలో ఒక గుడ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇక బాలకృష్ణ కూడా స్వయంగా రాజమౌళికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మరీ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా సేపు మాట్లాడారట..

రాజమౌళి కూడా బాలకృష్ణపై ఉన్న అభిమానంతో బాలకృష్ణ ఇంటికి వెళ్లి మాట్లాడి .. ఖచ్చితంగా మోక్షజ్ఞతో సినిమా చేస్తానని.. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాము కదా ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మంచి కథ కుదిరితే తప్పకుండా మోక్షజ్ఞతో సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. ప్రస్తుతం వైర ఈ వార్త కాస్త సోషల్ మీడియాలోల్ గా మారింది. ఇదే నిజమైతే మోక్షజ్ఞ మొదటి ఎంట్రీ తోనే గ్లోబల్ ఇమేజ్ అందుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఇదివరకే బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకి రీమేక్ గా ఆదిత్య 999 పేరుతో బాలకృష్ణ సొంతంగా దర్శకత్వం వహించి… ఆ సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడవడంతో మోక్షజ్ఞ మొదటి చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా లాంచ్ చేయడానికి ఇలా రాజమౌళిని సంప్రదించినట్లు సమాచారం.

- Advertisement -

నిజానికీ రాజమౌళి స్టార్ హీరోలతోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తారు. స్టార్డం వచ్చిన తర్వాత ఆ హీరోలతో సినిమాలు చేసే ఈయన డెబ్యూ గా రాబోతున్న మోక్షజ్ఞతో సినిమా చేస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రాజమౌళి సమక్షంలో జరగాలని బాలకృష్ణ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు కాబట్టి మరో ఐదారు సంవత్సరాలు సమయం పడుతుంది. మరి అప్పటిదాకా మోక్షజ్ఞ ఆగుతాడా? లేక మరో డైరెక్టర్ తో హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అన్నది చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు