Devara : దేవర నుండి మళ్ళీ లీక్స్ ?

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “దేవర” సినిమా ఒకటి. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇండస్ట్రీలో. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. అయితే నిజానికి దేవర సినిమా సమ్మర్ కే రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కావడంతో దసరాకి వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షూటింగ్ లో లీక్ అయిన ఆ వీడియో ని తారక్ అభిమానులు విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు.

Goa shooting video of NTR starrer Devara leaked

షూటింగ్ వీడియో లీక్..?

ఇక దేవర సినిమా షూటింగ్ ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. చాలా రోజుల పాటు గోవా బీచ్‌లో దేవర షూటింగ్ చేశారు. అయితే గోవాలో బోట్ సీక్వెన్స్‌కి సంబంధించిన ఓ రిహార్సల్ వీడియో లీకైంది. ఇందులో ఎక్కడా ఎన్టీఆర్ కనిపించకపోయినా కొంతమంది ఆర్టిస్టులైతే ఉన్నారు. గతంలో కూడా గోవాలో షూటింగ్ చేసిన ఓ వీడియో ఇలానే వైరల్ అయింది. అందులో బీచ్ నుంచి ఎన్టీఆర్ నడిచొస్తున్న సీన్ లీకైంది. ఓవైపు సినిమా లేటు అయిందని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయితే ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో షూటింగ్ సీన్స్ లీకవడం మూవీ టీమ్‌ను టెన్షన్ పెడుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిపోగా, మిగతా పార్ట్ ని కూడా ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ప్రమోషన్లపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఫియర్ సాంగ్ పేరుతో రిలీజైన ఈ పాట ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చేసింది.

- Advertisement -

వార్ 2 చేస్తూనే దేవర పూర్తి చేస్తున్నాడు..

ఇక దేవర (Devara) చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ ఇప్పటికే అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని మూవీ టీమ్ అంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రంతో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక దేవరతో పాటు ఎన్టీఆర్ తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి అయింది. ఇందులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఇక ఒకవైపు దేవర సినిమా పూర్తి చేస్తూనే వార్ 2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక దీంతో పాటు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ తో ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ సెప్టెంబర్‌ నుంచి మొదలుకాబోతుంది. ఇక అతి త్వరలోనే దేవర నుండి రెండో సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య డ్యూయెట్ సాంగ్ గా ఉండబోతుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు