Goat Story Leak : విజయ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గోట్ స్టోరీ లీక్

Goat Story Leak : తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్ ఈ సంవత్సరం అత్యంత అంచనాలు ఉన్న భారీ చిత్రాలలో ఒకటి. ఈ మూవీ విజయ్ కెరీర్ లో 68వ సినిమా కావడం విశేషం. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ స్టోరీ ప్లాట్ తాజాగా లీక్ అయ్యింది. మరి ఆ లీకైనా స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గోట్ స్టోరీ లీక్

గోట్ మూవీ టైమ్ ట్రావెల్ ఆధారంగా ఉంటుందని, కాబట్టి కథానాయకుడు తలపతి విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇప్పటిదాకా ఆయన అభిమానులు భావించారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లే సినీ జనాలకు ఈ అభిప్రాయాన్ని కలిగించాయి. అయితే తాజాగా లీకైన స్టోరీ లైన్ వింటే మరో కొత్త కోణం కన్పిస్తోంది. గోట్ ప్లాట్ తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. అందులో సినిమా టైమ్ ట్రావెల్ యాంగిల్‌ లేకపోవడం గమనార్హం.

స్టోరీ ఇదేనా ?

తాజా వార్తల ప్రకారం 2004లో రష్యాలోని మాస్కో మెట్రోపై ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను హీరో పట్టుకోవడమే గోట్ మూవీ స్టోరీ లైన్. ఈ దాడిలో 41 మంది మరణించినట్లు సమాచారం. దళపతి విజయ్ తన టీమ్‌తో కలిసి ఈ చిత్రంలో ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిని పట్టుకుంటారని తెలుస్తోంది.

- Advertisement -

Remember Thalapathy Vijay's GOAT first-look poster? Here's how it was made - India Today

జనాలను గోట్ టీం అందుకే భయపెట్టిందా?

ఈ చిత్రం ఇటీవలి అప్‌డేట్ ప్రకారం పుదుచ్చేరిలో గోట్ సినిమాకి సంబంధించిన యాక్సిడెంట్ సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించారు. దాన్నిబట్టి చూస్తే ఇప్పుడు లీకైన స్టోరీ నిజమే అన్పిస్తోంది. పుదుచ్చేరిలో యాక్షన్ సన్నివేశాల కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు అక్కడి అధికారుల నుంచి మేకర్స్ అనుమతి తీసుకుని షూటింగ్ చేశారు. అయితే పెద్ద శబ్దాలు, ప్రకంపనలు రావడం అక్కడున్న చాలా మంది నివాసితులను భయపెట్టాయి. ఓల్డ్ పోర్ట్ రోడ్‌లో బాంబులు, SUV క్రాష్‌ వంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. చిత్రీకరణ గురించి తెలియని స్థానికుల్లో ఈ పేలుళ్లు తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.

షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది ?

గోట్ షూటింగ్ చెన్నై, హైదరాబాద్, కేరళ, మాస్కోలో పూర్తయింది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం టీమ్ అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా డబ్బింగ్‌ని ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాడు హీరో విజయ్. రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ సంగీత స్వరకర్త యువన్ శంకర్ రాజా మొదటిసారిగా గోట్ సినిమాలో రెండు పాటలకు తన గాత్రాన్ని అందించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని విజిల్ పోడు సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు