Pushpa 2: జాక్ పాట్ కొట్టేసిన మరో యంగ్ బ్యూటీ, రంగమ్మత్త రేంజ్ గుర్తింపు వస్తుందా.?

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడుగా కెరియర్ మొదలుపెట్టిన సుకుమార్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించారు. సుకుమార్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది అని ఆడియన్స్ దాదాపు ఫిక్స్ అయిపోయారు. సుకుమార్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను రాబట్టాయి. ఇక సుకుమార్ కెరియర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిం అంటే రంగస్థలం అని చెప్పొచ్చు. సుకుమార్ లో ఈ రేంజ్ దర్శకుడు ఉన్నాడని నిరూపించిన సినిమా రంగస్థలం.

రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా రంగస్థలం అని చెప్పొచ్చు. ఆ సినిమాకు సంబంధించి అన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆ సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో కనిపించింది అనసూయ. అక్కడితో అనసూయ కూడా మరి కాస్త గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఇక పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేయడమే కాకుండా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. పుష్పరాజ్ మానియా ప్రపంచమంతా పాకింది.

Pavani Karanam

- Advertisement -

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప ది రూల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం ఎంతోమంది భారీ అంచనాలతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక యంగ్ బ్యూటీ కనిపించనుంది. ఆవిడ మరెవరో కాదు పావని కరణం. తిరువీర్ నటించిన పరేషాన్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది పావని. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది పావని అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో శ్రీవల్లి కి చెల్లెలుగా, అల్లు అర్జున్కి మేనకోడలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ పాత్ర కూడా అద్భుతంగా వర్కౌట్ అయితే రంగమ్మత్తకు దక్కిన గుర్తింపు పావని కూడా దక్కుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు