Goodachari 2: 100 కోట్లు బడ్జెట్ ఆ.? అడవి శేష్ కి అంత వర్త్ ఉందా.?

Goodachari 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అడవి శేష్(Adavi Sesh) ఒకరు. కర్మ(Karma) అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శేష్. కానీ ఈ సినిమా ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. ఇకపోతే విష్ణువర్ధన్(Vishnu Vardhan) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన పంజా(Panjaa) సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు శేష్. ఆ పాత్ర శేష్ మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత శేష్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గుర్తింపును సాధించుకున్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన రన్ రాజా రన్(Run Raja Run) సినిమా శేష్ కెరీర్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చి హీరోగా కూడా అవకాశాలు వచ్చేలా చేసింది.

ఇక ప్రస్తుతం శేష్ నటిస్తున్న సినిమా గూఢచారి 2. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. గూడచారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు 40 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ నెలలో ఈ చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం యూరప్ బయలుదేరబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక రీసెంట్ గానే గూడచారి సినిమా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

100 కోట్ల బడ్జెట్

గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇమ్రాన్ హష్మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే గూఢచారి 2 సినిమాకి సంబంధించి దాదాపు 100 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఒక అడవి శేషు సినిమాలు కి మంచి డిమాండ్ అయితే ఉంది కానీ మరి 100 కోట్లు మార్కెట్ అడవి శేష్ కి ఉందా అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమైనా ఒక సినిమా వర్కౌట్ అయితే బ్రేక్ ఈవెన్ జరగటం ఖాయం అనేది చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -

Emraan Hashmi

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఖచ్ఛితంగా అది బాగుంటుంది అని ఏమీ ఆలోచించకుండా థియేటర్ కు వెళ్లిపోయే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు శేష్ హీరోగా చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాలను సాధించాయి. కేవలం థియేటర్లోనే కాకుండా ఓటిటిలో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.శేష్ కెరియర్ లో గూఢచారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ బడ్జెట్లో ఇటువంటి క్వాలిటీ ఫిలిం చేయొచ్చు అని నిరూపించింది ఆ చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు