Aha: అల్లు అరవింద్ ఆహాకు షాక్ ఇచ్చిన గూగుల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా బాగానే పేరు సంపాదించారు అల్లు అరవింద్.. తెలుగు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న వ్యక్తులలో ఇతను కూడా ఒకరని చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తి..గత కొన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఓటీటీ ని ప్రారంభించారు.. దీంతో చాలామంది అల్లు అరవింద్ ని ఆహా అంటూ పొగిడేశారు.. భవిష్యత్తు కాలాన్ని ముందే అంచనా వేసిన ప్రొడ్యూసర్ అంటూ కూడా బాగానే పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఓటిటి మార్కెట్ అంటే అంత సాధ్యమైన పని కాదు అని అతి తక్కువ సమయంలోనే అల్లు అరవింద్ కి తెలుసొచ్చింది.

అమ్మకానికి ఆహా..
అల్లు అరవింద్ తీసుకువచ్చిన ఓటీటీకి మాత్రం పెద్దగా గిరాకీ ఉన్నట్టుగా కనిపించలేదు.. ఫలితంగా నష్టాలలో కొనసాగుతూ ఉంది. భారీ సినిమాలు కొనుగోలు చేయలేక.. కంటెంట్ సృష్టించలేక చాలా ఇబ్బందులకి గురవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పైగా ఆమధ్య ఆహా ఓటీటీ నే అమ్మేయాలని ప్లాన్ కూడా చేశారట అల్లు అరవింద్.. అందుకోసం సోనీ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్లు కుదరదని చెప్పగా Zee దగ్గరికి వెళ్ళగా అక్కడ పెద్దగా తనకి బేరం వర్క్ అవుట్ కాలేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి..

ఆహాకి షాక్ ఇచ్చిన గూగుల్:
అలా మరో సంస్థ దగ్గరకు వెళ్లినా పెద్దగా డీల్ సెట్ కాలేదని సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్మాతకు ఇప్పుడు తాజాగా గూగుల్ ఒక బ్యాడ్ న్యూస్ ని అందించింది.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆహా ఓటీటి యాప్ ను తొలగించినట్లు సమాచారం.. ఈ యాప్ ఎప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించలేదు ఫలితంగా సరికొత్త సబ్స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే అది సాధ్యమైన పని కాదు.. ఎందుకంటే ఆ మధ్య ప్లేస్టోర్ పాలసీ మొత్తాన్ని మార్చేసిందట. ఈ పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్ ను సైతం గూగుల్ స్టోర్ తొలగించేసింది.

- Advertisement -

పలు యాప్స్ పై గూగుల్ వేటు..
ఇందులో భాగంగా మెగా ప్రొడ్యూసర్ ఓటీటీ పైన కూడా వేటుపడింది. కేవలం దీనిపైన కాకుండా అల్ట్ బాలాజీ, శిక్ష భారత్, మ్యాట్రిమోనీ, నౌకరి డాట్ కామ్, ఇతరత్రా యాప్సులపైన గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది.. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ యాప్స్ తొలగించడం అన్యాయం అంటూ ఆ సంస్థలు తెలియజేస్తున్నారు.. ఇప్పటికే ఆదాయాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి సమయంలో గూగుల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సమయంలోనే అల్లు అరవింద్ ఆహా ఓటీటీ యాప్ స్పందించింది.. ఈ అంతరాయానికి చింతిస్తున్నాము..త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ కి సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఇదివరకే స్పందిస్తూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్న గూగుల్ సంస్థతోనే కలవాలంటూ.. వారితోనే చర్చలు జరపాలంటూ సూచించారు.. అయితే అంతలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ లను తొలగించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు