Guntur Kaaram : యంగ్ టైగర్ రిజెక్ట్ చేసిన కథే మహేష్ దగ్గరకు వచ్చిందా?

Guntur Kaaram : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరో దగ్గరికి వెళ్లడం కామనే. అయితే ఒక్కొక్కసారి తాము వద్దనుకున్న స్టోరీనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హీరోలకు షాక్ ఇస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఆ మూవీని వదులుకోవడమే మంచిదయింది అనే ఫీలింగ్ కలుగుతుంది స్టార్స్ కి. తాజాగా “గుంటూరు కారం” మూవీ విషయంలో కూడా అదే జరిగింది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథే “గుంటూరు కారం” రూపంలో మహేష్ బాబు దగ్గరకు వచ్చిందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ యావరేజ్ టాక్ తో నడుస్తోంది. “ఖలేజా” మూవీ ఇచ్చిన రిజల్ట్ తో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరపైకి మరో మూవీ రావడానికి చాలా టైం పట్టింది. రీసెంట్ గా “అల వైకుంఠపురం”లో మూవీతో అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఇచ్చిన త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయడానికి మహేష్ బాబు ఎట్టకేలకు ధైర్యం చేశాడు. కానీ ఈసారి కూడా వీళ్ళిద్దరి కాంబో కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడని, కానీ ఆయన ప్రస్తుతం బిజీగా ఉండడంతో, అదే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి “గుంటూరు కారం”గా మహేష్ ముందు పెట్టాడని, మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద నమ్మకంతో ఈ మూవీని ఓకే చేశాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

మొత్తానికి ఎన్టీఆర్ కథను మహేష్ బాబు మీద రుద్ది, ఆయనకు మరో ప్లాప్ ఇచ్చావు అంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూ మరో సినిమాకు డైలాగులు, స్క్రీన్ ప్లే వంటివి రాస్తూ కూర్చుంటే ఇలాంటి డిజాస్టర్లు తప్పవు అంటూ త్రివిక్రమ్ మీద మండిపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో ఒక ప్లాఫ్ నుంచి తప్పించుకున్నందుకు సంతోషపడుతున్నారు.

- Advertisement -

కానీ కొంతమంది మాత్రం మహేష్ బాబును తాము అనుకున్న రేంజ్ మాస్ అవతార్లో చూసినందుకు సంతోషిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు “గుంటూరు కారం” మూవీకి, “హనుమాన్”కు మధ్య ఏర్పడ్డ వివాదాలను మరి కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు “హనుమాన్” దూకుడు ముందు “గుంటూరు కారం” డీలా పడిపోయింది. బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందనున్న నెక్స్ట్ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ దృష్టి పడింది. అయితే జక్కన్న సినిమాను చెక్కడానికి చాలా టైం తీసుకుంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం పక్కా. కాబట్టి ఆ మాత్రం వెయిట్ చేయడంలో తప్పులేదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు