Guntur Kaaram : ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ పై అసంతృప్తి… ఏంటి త్రివిక్రమ్ ఇలా చేశాడు?

Guntur Kaaram : సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న “గుంటూరు కారం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9న గుంటూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో మహేష్ అభిమానులు తరలి రావడంతో సక్సెస్ ఫుల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ ఈవెంట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడిన తీరే ఆయన అభిమానులను నిరాశకు గురి చేసింది. ఏంటి త్రివిక్రమ్ ఇలా చేశాడు? అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఫంక్షన్లలో మాట్లాడే మాటలు చాలా గొప్పగా ఉంటాయి. సూటిగా ఉండే ఆయన డైలాగ్స్ ఈవెంట్లో హైలెట్ గా నిలుస్తాయి. ఆయన పేల్చే మాటల తూటాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ విచిత్రంగా “గుంటూరు కారం” మూవీ ఈవెంట్ లో మాత్రం చాలా తక్కువ మాటలతో సరిపెడుతూ స్పీచ్ ని తొందరగా కంప్లీట్ చేశాడు త్రివిక్రమ్. మరి దీని వెనక కారణం ఏంటి అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజెన్లు. గత రెండు మూడు ఫంక్షన్లలో కూడా త్రివిక్రమ్ ఎక్కువగా మాట్లాడలేదు.

ఇంతకుముందులా కాకుండా వీలైనంత ఎక్కువ సైలెంట్ గా ఉండడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన. నిజానికి త్రివిక్రమ్ స్టేజి మీదకు వచ్చాడు అంటే ఈవెంట్లో పాల్గొన్న అభిమానులతో పాటు, టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా ఆయన స్పీచ్ ను వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ “గుంటూరు కారం” మూవీ విషయంలో మాత్రం అలా ఎదురు చూసిన ప్రేక్షకులను త్రివిక్రమ్ తన తీరుతో అసంతృప్తికి గురి చేశాడు.

- Advertisement -

దీంతో త్రివిక్రమ్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటున్నాడు అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకు ఆయన కొన్ని ఈవెంట్లలో పాల్గొనగా, వాటికి సంబంధించి గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. స్టేజ్ మీదకు రాగానే ఈ డైరెక్టర్ తనకే అన్ని తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తాడని, ప్రేక్షకులను మాయ చేస్తాడని, తన మాటలతో కట్టిపడేస్తాడనే కామెంట్లు ఎక్కువగా రావడంతోనే ఇకపై ఈవెంట్లలో పెద్దగా మాట్లాడకూడదని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడని, అందుకే స్టేజ్ మీదకి వచ్చి కేవలం కొన్ని మాటలతో మాత్రమే సరిపెట్టి స్పీచ్ ను ముగిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల “గుంటూరు కారం” మూవీపై హైప్ గట్టిగానే పెరిగింది. ఈవెంట్లో జరిగిన హైలెట్స్ గురించే ఇంకా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు