Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. అఖిల్ ట్రోలింగ్ స్టఫ్ కూడా వాడేస్తున్నారా?

Guntur Kaaram: ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఆసక్తికరమైన సినిమాల్లో “గుంటూరు కారం” ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందింది. 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది అంటూ చిత్రబృందం అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. కానీ టైం మాత్రం ప్రకటించకపోవడంతో మహేష్ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు “గుంటూరు కారం” మూవీలోని కొన్ని ఆసక్తికరమైన హైలెట్స్ లీక్ అయ్యాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం 6 గంటల తరువాత హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంత ట్రై చేసినా మేకర్స్ కు అనుమతి దొరకడం లేదు. నిజానికి ముందుగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కుదరకపోవడంతో వేరే వేదికను వెతికే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఇంకా ఈ విషయం గురించి క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జనవరి 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే “గుంటూరు కారం” మూవీ ట్రైలర్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఫిల్మ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ మూవీలో మహేష్ ను కొత్తగా చూపించడమే కాకుండా మాస్ ఆడియన్స్ ఈలలతో గోల చేసే స్టఫ్ ను గట్టిగానే ప్లాన్ చేశారట.’కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ మాత్రమే కాదు, ‘గుంటూరు కారం’లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ ని దర్శకుడు త్రివిక్రమ్ గట్టిగానే వాడాడట. అందులో ‘అయ్యగారే నెంబర్ 1 ‘ అంటూ హీరో అఖిల్ పై ట్రెండ్ అయిన మీమ్ కూడా ఉంటుందట. ఇవన్నీ మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా నిబ్బా,నిబ్బీ ..అంటూ ట్రెండ్ అవుతున్న బ్యాచ్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని టాక్. మరి త్రివిక్రమ్ ట్రైలర్ కోసం ఎలాంటి కంటెంట్ ను కట్ చేశారో, మహేష్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే విధంగా ఎలాంటి సీన్స్ ను చూపించబోతున్నారో అని ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు