Hansika : హన్సిక కాపురంలో చిచ్చు పెట్టిన ఆ షో… రంగంలోకి దిగిన స్టార్ హీరో..

Hansika : హన్సిక మోత్వానీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.. వరుసగా సినిమాలు చేసి పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగులో దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సినిమా అమ్మడు ఆశలపై దెబ్బేసింది. కానీ హన్సిక గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది. అందులో కొన్ని సినిమాలు హిట్ అవ్వగా , మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాఫ్ అయ్యాయి.. దాంతో అమ్మడు బాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే రీసెంట్ గా బుల్లితెరపై మెరిసింది.

బుల్లితెర పై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక డ్యాన్స్ షో ఢీ షోలో జడ్జీగా వ్యవహరిస్తోంది.. గత కొన్ని వారాలుగా హన్సిక ఈ షోలో కొనసాగుతుంది. ఈ షోలో హైపర్ ఆది లాంటి వాళ్ళు ఆమె పై పంచులు వేస్తూ ఆడేసుకుంటున్నారు. కొన్నిసార్లు కౌంటర్లు వేస్తుంది.. అయితే తన భార్యను కొందరు హేళన చెయ్యడం ఆమె భర్తకు నచ్చడం లేదట.. అంత పెద్ద హీరోయిన్ అయ్యి ఉండి స్మాల్ స్క్రీన్ పై కనిపించడం అసలు ఇష్టం లేదట.. అందుకే షో మానెయ్యమని హన్సికకు ఆమె భర్త చెప్పినట్లు తెలుస్తుంది..

Hansika's couple is about to get divorced because of that show
Hansika’s couple is about to get divorced because of that show

కానీ , హన్సిక మాత్రం దానికి ససేమిరా అనడంతో గొడవలు మొదలైనట్లు తెలుస్తుంది.. ఇప్పటికే చాలా సార్లు ఈ విషయంపై ఇరు కుటుంబాల్లో గొడవలు జరిగినట్లు సమాచారం. ఇక వీరిద్దరూ విడాకుల వరకు వెళ్లినట్లు, వీరిద్దరిని కలపడానికి ఓ స్టార్ హీరో రంగంలోకి దిగినట్లు టాక్.. హన్సిక ఆ హీరో మాట విని షో నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఢీ షోకు చాలా మంది జడ్జీలు మారారు.. ఇక ఈ అమ్మడు తప్పుకుంటే నెక్స్ట్ ఎవరిని యాజమాన్యం దింపుతుందో చూడాలి.. ఏదేమైన ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.. హన్సిక ప్రస్తుతం సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు