Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా హీరోయిన్

Hari Hara Veeramallu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ ప్రస్తుతం చాలా బిజీగా మారాడు పవన్ కళ్యాణ్. సినిమాల్లో వరుసగా హిట్ సాధిస్తూ కెరియర్ పీక్ లో ఉన్న టైంలో 2014లో జనసేన అనే పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచి అధికారంలోకి రావడానికి సహాయపడ్డాడు. ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. అయితే అక్కడితో ఆగకుండా అలుపెరగని పోరాటం చేసి నేడు 100% సక్సెస్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ లో తన సత్తా చాటారు.

ఇకపోతే అజ్ఞాతవాసి అనే సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చొరవతో వకీల్ సాబ్ అనే సినిమాకి సైన్ చేసి రీఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకేసారి దాదాపు 5, 6 సినిమాలను లైన్లో పెట్టారు, వాటిలో మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇంకో మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు.

Hari Hara Veera Mallu

- Advertisement -

హరిహర వీరమల్లు సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అని అప్పట్లో ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ శ్రీనిధి శెట్టి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఇకపోతే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కేవలం 20 నుంచి 25 రోజులు కేటాయిస్తే సినిమా పూర్తయిపోతుంది. ఈ సినిమాను డిసెంబర్ లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు