Harish Shankar : ప్రయత్నాలు ఫలించాయా ?

రీమేకులకు మసి పూసి మారేడుకాయ చేసి హిట్ కొట్టడం హరీష్ శంకర్ స్టైల్. ఇలాంటి డైరెక్టర్ గత మూడేళ్ల నుంచి మెగా ఫోన్ కు దూరంగా ఉంటున్నాడు. మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ చేసినా, ఈయన నుంచి సినిమాలు మాత్రం రాలేదు. దీనికికారణం ఏమిటంటే.. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

ఈ ప్రకటన వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా సెట్స్ పైకి ఎక్కలేదు. ఇప్పట్లో వస్తుంది అని కూడా గ్యారంటీ లేదు. పవన్ వల్ల ఇప్పటికే మూడు సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకున్న హరీష్ శంకర్, ఇప్పటి వరకు వచ్చిన గ్యాప్ ను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం హరీష్ శంకర్ బాలీవుడ్ గడప తొక్కాడని సమాచారం. అక్కడ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా ఫిక్స్ చేసుకోవడానికి పడిగాపులు కాస్తున్నాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ తో మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడని టాక్ వచ్చింది.

ఫైనల్ గా సల్లు భాయ్ ని హరీష్ శంకర్ ఒప్పించినట్టు సమాచారం. దీంతో త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్, సల్మాన్ ఖాన్ కాంబో మూవీ వస్తుందని తెలుస్తోంది. స్టోరీ పరమైన చర్చలు కూడా పూర్తి అయ్యాయట. అయితే సల్మాన్ ఖాన్ కోసం హరీష్ శంకర్ ఏ రీమేక్ ను సిద్ధం చేశాడు ? అసలు రీమేక్ స్టోరీనా ? లేదా సల్లు భాయ్ కోసం కొత్త స్టోరీని రాశాడా ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు