Mr Bacchan : ఆ లాస్ట్ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారు.. హరీష్ గారు?

Mr Bacchan : మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “మిస్టర్ బచ్చన్” సినిమా ఆగష్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షాక్, మిరపకాయ్ తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొని ఉండగా, దానికి తగ్గట్టు గానే టీజర్, సాంగ్స్ ప్రోమోలతో సినిమాపై అంచనాలు పెంచేస్తూ వచ్చారు. ఇక హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ని కూడా నిన్న రిలీజ్ చేయగా, నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Harish Shankar punched the media with the last dialogue in Mr Bacchan trailer

ఆ లాస్ట్ డైలాగ్ పంచ్ ఎవరికీ?

ఇక మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట ట్రెండ్ అవుతుండగా, ట్రైలర్ లో మాస్ మహారాజ్ రవితేజ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించాడు. హరీష్ శంకర్ తన మార్క్ ఎలివేషన్లతో ఫ్యాన్స్ కి మరింత గూస్బంప్స్ తెప్పించాడు. ఇక రవితేజ ఈ సినిమాలో ఒక ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా నటించగా, జగపతిబాబుపై రైడ్ చేసే క్రమంలో ఎదురైన పరిస్థితులు ఎంత వరకు దారితీసాయనేది సినిమా నేపథ్యంగా తీశారు. ఇదిలా ఉండగా ట్రైలర్ లో లాస్ట్ లో ఫోన్ లో ఓ డైలాగ్ అంటాడు. చాలామంది భయపడేది సమస్యలకు కాదు, పుకార్లకు రూమర్లకు… పని పాట లేని చాలామంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు అని అంటాడు. ఈ డైలాగ్ హరీష్ శంకర్ కావాలనే పెట్టాడని అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

అయితే గత కొన్ని రోజులుగా మీడియా హరీష్ శంకర్ తో అనవసరమైన వాదనలు చేస్తుండగా హరీష్ శంకర్ వాళ్ళకి బాగానే కౌంటర్ వేస్తున్నాడు. అలాగే కొన్ని మీడియా ఛానళ్ళు పుట్టించే పుకార్లతో పలువురు అనవసరంగా జనాల దృష్టిలో బబ్లేమ్ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హరీష్ శంకర్ ఈ డైలాగ్ ని పెట్టాడని టాక్. అలాగే ఆ మధ్య ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఎన్నో వ్యక్తిగత పుకార్లు, వ్యక్తిగత విమర్శలు మీడియా ఛానళ్ళు కూడా చేసాయి. ఇక హరీష్ శంకర్ పవన్ కి ఎంత వీరాభిమానో తెలిసిందే. వాళ్ళకి కౌంటర్ గానే ఈ డైలాగ్ పెట్టినట్టు అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వా ప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు