HBD Mokshagna: మొదటి సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?

HBD Mokshagna : నందమూరి బాలకృష్ణ (Balakrishna) వారసుడి సినీ ఎంట్రీ కోసం కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం అభిమానులు ఎంతో గానో ఎదురు చూడడం, ఆ ఏడాదికి సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో నిరాశ చెందడం సాధారణమైపోయింది. అభిమానులు కూడా మోక్షజ్ఞ మూవీ కోసం ఎదురుచూడడం, ఆ తర్వాత నిరాశ చెందడం అలా అలవాటు పడిపోయారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అభిమానుల చూపులకు తెరపడింది. నేడు మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరగనుంది.

HBD Mokshagna: Do you know how much remuneration is being taken for the first film..?
HBD Mokshagna: Do you know how much remuneration is being taken for the first film..?

ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలిచిత్రం..

హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అందులో భాగంగానే మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ఎంతో శ్రమించి అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణంలో భాగస్వామి అయింది. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ కూడా చిన్న కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి మోక్షజ్ఞ తీసుకుంటున్న పారితోషకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మొదటి సినిమాకే రూ .20 కోట్లు..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , మోక్షజ్ఞ ఈ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. నిజానికి ఇది తండ్రి కంటే ఎక్కువ అని చెప్పాలి . ఎందుకంటే బాలకృష్ణ ఆరుపదుల వయసు దాటినా, ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఆయన రెమ్యూనరేషన్ ఇంకా రూ.15 కోట్లు మించలేదు. అలాంటిది మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడంతో ఇదంతా బాలయ్య చొరవే అంటూ కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొదటి సినిమాతోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మరి ఈ రెమ్యూనరేషన్ కి తగ్గట్టుగా మోక్షజ్ఞ ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.

- Advertisement -

రామ్ చరణ్ తర్వాత ఆ స్థానాన్ని మోక్షజ్ఞ భర్తీ చేస్తారా..?

ఇకపోతే చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ ,రెండవ చిత్రంతోనే స్టార్ హీరోగా మారిపోయారు. ఆయన తరువాత నాగార్జున కుమారులు నాగచైతన్య , అఖిల్ కూడా భారీ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెండవ సినిమాతోనే స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టిన ఏకైక హీరో రామ్ చరణ్ మాత్రమే. ఆ తర్వాత మోక్షజ్ఞ కి కూడా ఇప్పుడు అవకాశం ఉంది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారా లేక తదుపరి చిత్రాలతో ఆ హోదాను దక్కించుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు