Rashmika: నా బాయ్ ఫ్రెండ్ అతడే.. మొత్తానికి బయటపడ్డ రష్మిక..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్ అనగానే వెంటనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు గుర్తుకొస్తుంది. అయితే వీరిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించగా..అలా పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. డేటింగ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఎన్నిసార్లు వీరు స్పందించినా నెటిజెన్లు మాత్రం నమ్మలేదు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక మందన్న చేసిన కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి. రష్మిక మందన్న కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్ మీద ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇందులో శ్రీవల్లి గా అలరించడానికి మరోసారి సిద్ధం అయ్యింది. ఇక ఇంకొక వైపు గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ మూవీకి హీరో కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పుడు మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఇక అందులో భాగంగానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లో తన బాయ్ ఫ్రెండును పరిచయం చేసింది. అతడు ఎవరో కాదు నాని దసరా సినిమాలో నటించిన దీక్షిత్ శెట్టి. కన్నడలో ఈయన నటించిన దియా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇక దీక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని రిలీజ్ చేసింది చిత్రం బృందం . అందులో గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ రాసుకుంది. అంతేకాదు ఎందుకు సంబంధించిన వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్ వైరల్ గా మారింది
అందాల రాక్షసి సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత హౌరా బ్రిడ్జి, హైదరాబాద్ లవ్ స్టోరీ, యూటర్న్, ఆ తర్వాత అలా ఎలా వంటి సినిమాలలో నటించి మెప్పించారు. శ్రీమంతుడులో కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసి.. ప్రస్తుతం డైరెక్టర్ గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు