Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడే.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత టాలీవుడ్ కి దూరమైన ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ గత కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం.. ఆ తర్వాత కొంతకాలానికి తన బిడ్డను పరిచయం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తన బాబుకి తండ్రి ఎవరు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో భర్త ఎవరో చెప్పమని అందరూ రకరకాల కామెంట్లు చేశారు.

ఇకపోతే తాజాగా తన బిడ్డకు తండ్రి..తన భర్త ఎవరు అన్న విషయాన్ని వెల్లడించారు ఇలియానా.. ఇటీవల ఇలియానా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి తన భర్త ఎవరు అన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో డేట్ నైట్ అంటూ ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఈమె.. అతనే తన భర్త అని ఆరోజు నేరుగా చెప్పలేదు. ఈ విషయంపై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే తాజాగా అతనే తన భర్త అంటూ తెలియజేసింది.. చిట్ చాట్ లో భాగంగా మీరు సింగిల్ పేరేంట్ కదా.. ఎలా ఉంది? అని ఒక నెటిజన్ ప్రశ్న వేయడంతో.. దానికి సమాధానం ఇస్తూ.. నేను సింగిల్ పేరెంట్ కాదు.. నా కొడుకుకి తండ్రి ఉన్నారు అంటూ తెలియజేసింది. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న విషయం తెలిసిపోయిందని చెప్పవచ్చు.

అయితే ఇలియానా భర్త ఎవరు అన్న విషయం బయటకు తెలిసింది… కానీ అతడు బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే అన్ని విషయాలను కూడా వెల్లడిస్తాను అని చెప్పినట్లు సమాచారం ఇకపోతే ఆమె సినిమా రీ యంట్రీ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమ్మగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు త్వరలోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇలియానా ఈ ఏడాది మే నెలలో తన ప్రెగ్నెన్సీ గురించి అందరికీ తెలియజేసి.. ఆగస్టు ఒకటిన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు