Honeymoon Express : దీనిపైనే కుమారి ఆశలన్నీ?

Honeymoon Express : టాలీవుడ్ లో ‘అలాఎలా’ అనే ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి, సుకుమార్ నిర్మాణం లో వచ్చిన కుమారి 21F సినిమాతో ‘కుమారి’గా ఫేమస్ అయిన హెబా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కుమారి 21F అనే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గాకుండా, ఒకే ఇయర్ లో అరడజనుకి పైగా ఆఫర్లు దక్కించుకున్న ఈ గ్లామరస్ బ్యూటీ చిన్న సినిమాల్లో వరుసగా నటిస్తూ, అప్పట్లో యంగ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించడంతో అవకాశాలు తగ్గాయి. ఓ దశలో సెకండ్ లీడ్ కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేయాల్సి వచ్చింది. దానికి కారణం మంచి స్క్రిప్ట్ లు సలెక్ట్ చేసుకోకపోవడమే అని తెలుస్తుంది. పైగా ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్ల పైనే అయినా సరైన గుర్తింపు తెచ్చిన సినిమాలంటే వేళ్ళ మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇక హెబా పటేల్ నటన పరంగా చేసిన మంచి సినిమాలు అంటే, కెరీర్ బిగినింగ్ లో చేసిన కుమారి21F తర్వాత మళ్ళీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ లో మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు చాలా రోజులకు “హనీమూన్ ఎక్స్ప్రెస్” (Honeymoon Express) అనే సినిమాతో హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

Heba Patel Hopes on Honeymoon Express

ఈ సినిమా అయినా కలిసొస్తుందా?

ఇక హెబా పటేల్ రెండేళ్ల కింద చేసిన ఓదెల రేల్వే స్టేషన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమా ఓటిటి లో రావడంతో ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అందువల్ల ఈ చిన్నది టాలీవుడ్ లో కొన్నాళ్ళు కనిపించకుండా పోయింది. లాస్ట్ ఇయర్ ఏదో రెండు వెబ్ సిరీస్ లో మాత్రమే కనిపించింది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత హనీ మూన్ ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకోనుంది. అలాగే తమిళ్, కన్నడలో మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. అయితే ఇతర భాషల్లో సినిమాలు చేసినా తెలుగు లో ఉన్న గుర్తింపు తనకి రాదు. అందుకే ఇక్కడే ఉండి సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయింది హెబ. మరి ఈ సారైనా హెబా పటేల్ కి అనుకున్న హిట్ వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

సినిమాల్లో తక్కువ ఆన్లైన్ లో ఎక్కువ?

ఇక హెబా పటేల్ సినిమాలు ఈ మధ్య తగ్గించినా వరుస ఫోటోషూట్లతో మాత్రం రచ్చ చేస్తూనే ఉంది. రోజుకో స్టిల్ తో వారానికో స్పెషల్ ఫోటోషూట్ తో ఇంస్టాగ్రామ్ లో రచ్చ చేస్తుంటుంది. ఇక ఆ మధ్య చీరకట్టులో బాబ్లీ లా తయారై కిక్కెకించిన హెబా బొద్దుగా కుర్రకారుని రెచ్చ గొట్టింది. ఇప్పుడు సినిమాల కోసం మళ్ళీ ఫిట్ నెస్ పై దృష్టి పెటింది. ఇలా ఫోటో షూట్లతో ఎప్పటికప్పుడు హడావిడి చేస్తుంది కాబట్టే తనకి ఆ మాత్రం ఆఫర్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక హెబా నటించిన తాజా సినిమా హానీమూన్ ఎక్స్ ప్రెస్ నుండి తాజాగా ఓ పాట రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమాలో యూట్యూబ్ స్టార్ చైతన్య రావు హీరోగా నటించాడు. జులై లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు