Hebah Patel : మిస్టేక్స్ తెలుసుకుని మారడానికి ప్రయత్నిస్తున్న కుమారి…

Hebah Patel : టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి, సుకుమార్ నిర్మాణం లో వచ్చిన కుమారి 21F సినిమాతో కుమారిగా ఫేమస్ అయిన హెబా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కుమారి 21F అనే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గాకుండా, ఒకే ఇయర్ లో అరడజనుకి పైగా ఆఫర్లు దక్కించుకున్న ఈ గ్లామరెస్ బ్యూటీ చిన్న సినిమాల్లో వరుసగా నటిస్తూ, అప్పట్లో యంగ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించడంతో అవకాశాలు తగ్గాయి. ఓ దశలో సెకండ్ లీడ్ కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేయాల్సి వచ్చింది. దానికి కారణం మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకోకపోవడమే అని తెలుస్తుంది. పైగా ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్ల పైనే అయినా సరైన గుర్తింపు తెచ్చిన సినిమాలంటే వేళ్ళ మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇక హెబా పటేల్ కెరీర్ లో బెస్ట్ సినిమాలు అంటే, కెరీర్ బిగినింగ్ లో చేసిన కుమారి21F తర్వాత మళ్ళీ ఓదెల రైల్వే స్టేషన్ లో మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. అయినా అడపాదడపా సినిమా ఛాన్సులు దక్కించుకుంటూ నెట్టుకుంటూ వస్తుంది.

Hebah Patel Latest Photoshoots Viral On Social Media

సినిమా ఛాన్సులు తగ్గడానికి ఇదే కారణమా?

అయితే ఆ మధ్య అవకాశాల్లేక ఈ చిన్నది టాలీవుడ్ లో కొన్నాళ్ళు కనిపించకుండా పోయింది. లాస్ట్ ఇయర్ ఏదో రెండు వెబ్ సిరీస్ లో మాత్రమే కనిపించింది. అలాంటి తరుణంలో అందరూ హెబా పని అయిపొయింది అన్నారు. అయితే ఈ అమ్మడు తన ప్లానింగ్ లో తాను ఉంది. తెలుగులో పెద్దగా బిజీగా లేకపోయినా, అన్ని భాషల్లో కలిపి ఓ నాలుగు సినిమాలు లైన్లో పెట్టింది. అయితే హెబా పటేల్ కి అంతగా ఛాన్సులు రాకపోవడానికి కారణం ఎంతో ఫిట్ గా స్లిమ్ గా ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో హెబా కాస్త బొద్దుగా ఉంది. పైగా మోహంలో కాస్త కళ తగ్గినట్టనిపిస్తుంది. కొందరైతే కుమారి ఏంటీ కుమారి ఆంటీ లా తయారయింది అంటూ ట్రోల్ చేసారు. ఫోటోషూట్లలో కూడా అంత అట్రాక్టీవ్ గా కనిపించడం లేదని ట్రోల్ చేసారు. అందుకే హెబా కి నిర్మాతలు ఆఫర్లు ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. అయితే హెబా లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోషూట్లతో హెబా పటేల్ చేంజ్ అయిందని అనిపిస్తుంది.

- Advertisement -

తప్పు తెలుసుకుని మారుతుందా?

ఇక హెబా పటేల్ (Hebah Patel) లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఓ ఫోటోషూట్లో మళ్ళీ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో తయారయ్యి కొత్త ఫొటోలు షేర్ చేసింది. ఇండియన్ సల్వార్ టైప్ చుడిదార్ డ్రెస్ లో రెడ్ మెరూన్ కలర్ డ్రెస్ లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇందులో హెబా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. చూస్తుంటే హెబా పటేల్ తన తప్పు తెలుసుకుని, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఇక దానికి ముందు వేసిన ఫోటోషూట్లలో బాగా ఆకర్షణీయంగానే కనిపించింది. ఇక త్వరలో తెలుగులో హనీమూన్ ఎక్స్ప్రెస్ అని సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతుంది హెబా పటేల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు