Honey Rose: క్యాస్టింగ్ కౌచ్ పై హనీ రోజ్ షాకింగ్ కామెంట్స్ .. వారిపై ఫైర్ అవుతూ..?

Honey Rose.. మలయాళం ముద్దుగుమ్మ హనీ రోజ్ తెలుగులో గతంలో పలు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో నటించిందో అప్పటి నుంచి ఒక్కసారిగా ఈమె పాపులారిటీ పెరిగిపోయింది. క్రేజ్ అయితే పెరిగింది కానీ ఈమెకు సినిమాలలో అవకాశాలు మాత్రం రావట్లేదు. కానీ పలు ఫంక్షన్లకు ఈమెను విపరీతంగా ముఖ్యఅతిథిగా పిలిచేస్తూ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అందరిని అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఎప్పుడు వరుస ఫోటో షూట్ తో సందడి చేసే ఈమె సడన్ గా ఇండస్ట్రీలో ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి కామెంట్లు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.

Honey Rose: Honey Rose's shocking comments on the casting couch .. firing on them..?
Honey Rose: Honey Rose’s shocking comments on the casting couch .. firing on them..?

హేమా కమిటీ పై హనీ రోజ్ కామెంట్స్..

మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక తర్వాత నటీనటులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని తర్వాత చాలామంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హనీ రోజ్ కూడా దీనిపై స్పందించింది. మలయాళ సినిమాలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆమె కోరింది. తాజాగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ నుంచి తిరిగి వస్తుండగా అక్కడ ఈ విషయంపై మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేసింది.

అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి..

మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువగా నటీమణులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలోనే లైంగిక వేధింపులు అలాగే దోపిడీకి పాల్పడిన వారిని శిక్షించాల్సింది అంటూ హనీ రోజ్ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే అలా చేసినవారిని మనం చట్ట ప్రకారం శిక్షించాలి కానీ అవన్నీ జరగవు కదా.. అంటూ మళ్ళీ ఆమె కామెంట్లు చేసింది. అలాగే తాను నటించిన సెట్స్ లో ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని, అలాగే ఇతరులకు కూడా జరిగినట్టు తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హనీ రోజ్ రాచెల్ అనే సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ గతంలో రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ గా తెరకెక్కుతోంది అని తెలుస్తోంది.

- Advertisement -

హనీ రోజ్ కెరియర్..

హీరోయిన్ హని రోజ్ విషయానికి వస్తే.. మలయాళం లో 2005లో విడుదలైన బాయ్ ఫ్రెండ్ అనే చిత్రం ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషల్లో కూడా నటించింది.. ఇక తెలుగులో తొలిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక ఈమె పలు తెలుగు చిత్రాలతో నే కాదు మలయాళం, తమిళ్, కన్నడ చిత్రాలతో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా కాస్టింగ్ కౌచ్ పై ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. మరి హనీ రోజ్ కామెంట్స్ కి మలయాళ ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు