Honey Rose: అతడితో రహస్యంగా ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య బ్యూటీ..!

Honey Rose.. మలయాళీ ముద్దుగుమ్మ హనీరోజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ లోకి ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో వెలుగులోకి రాలేదు. కానీ ఎప్పుడైతే బాలకృష్ణతో కలిసి వీర సింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ చేసిందో అప్పటినుంచి భారీ పాపులారిటీ దక్కించుకుంది.. ఇందులో బాలయ్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది దీంతో ఈ సినిమా తర్వాత భారీగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.. అయితే సినిమా ఆఫర్లు రాలేదు కానీ ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ భారీగానే ఆర్జిస్తోంది.

Honey Rose: Secret affair with him.. Balayya beauty gave clarity..!
Honey Rose: Secret affair with him.. Balayya beauty gave clarity..!

బాలయ్య సినిమాతోనే క్రేజ్..

ఇకపోతే గతంలో ఈమె శివాజీ నటించిన ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది..అప్పుడు వెలుగులోకి రాలేదు. కానీ గత ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా.. శృతిహాసన్ లీడ్ రోల్ పోషించిన చిత్రం వీర సింహారెడ్డి..ఇందులో ఈమె నటించింది. ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. ఈ సినిమా ద్వారా భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా హనీ రోజ్..

ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది హనీరోజ్. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్ళ సైతం ఫిదా అవుతూ ఉంటారు.. నిత్యం వరుస ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

ఆ నిర్మాతతో సహజీవనం..

అసలు విషయంలోకి వెళ్తే .. ఈ ముద్దుగుమ్మకు ఒక తమిళ నిర్మాతతో రిలేషన్ ఉందనే వార్త సంచలనం సృష్టిస్తోంది.. అంతేకాకుండా రహస్యంగా ఆ నిర్మాతతో ఈమె సహజీవనం చేస్తుందని.. అందుకే సినిమాలు లేకపోయినా కెరియర్ కొనసాగిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన హనీ రోజ్..

అయితే తాజాగా ఈ వార్తలపై హనీ రోజ్ స్పందించినట్లు తెలుస్తోంది.. హనీ రోజ్ మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు.. దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది.. మొత్తానికైతే హనీ రోజ్ క్రేజీ చూసి తట్టుకోలేక కొంతమంది ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా హనీ రోజ్ పై ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయగా ఆమె స్పందించి క్లారిటీ ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు