Indian 2 : భారతీయుడు 2 ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్న కాజల్… టీంపై కోపంగా ఉందా?

Indian 2 : కమల్ హాసన్ 28 ఏళ్ల తరువాత సేనాపతిగా తిరిగి వస్తున్న తాజా మూవీ ఇండియన్ 2. 2024లో అత్యంత భారీ అంచనాలున్న సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ మూవీ రిలీజ్ తో సహా షూటింగ్ వంటి విషయాల్లో చాలా సంవత్సరాలుగా సమస్యలను ఫేస్ చేసింది. చివరకు మరో రెండు రోజుల్లో సిల్వర్ స్క్రీన్‌ పైకి రావడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 ప్రధాన తారాగణంలో ఒకరైన కాజల్ అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడం కొత్త అనుమానాలకు తెర తీసింది.

ప్రమోషన్లకు కాజల్ దూరం

శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన తమిళ భాషా చిత్రం ఇండియన్. ఇందులో కమల్ హాసన్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించగా, 1996లో రిలీజై సూపర్‌ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇండియన్‌కి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరపైకి రాబోతోంది. జూలై 12న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్‌తో పాటు సిద్ధార్థ్, ఎస్‌జె సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, మనోబాల, వివేక్, నేదురుమూడి వేణు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిల్మ్స్ నిర్మాతలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరో రెండ్రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచారు. కానీ ఒక్క ఈవెంట్ లో లేదా కనీసం ఒక ఇంటర్వ్యూలో కూడా కాజల్ మాత్రం కన్పించలేదు.

Kajal Aggarwal on Indian 2: Super stoked to start filming - India Today

- Advertisement -

కాజల్ సీన్లు డిలీట్ చేశారా?

దర్శకుడు శంకర్‌తో పాటు కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. సినిమా ప్రమోషన్ కోసం సింగపూర్ లాంటి దేశాలకు కూడా వెళ్లారు. ఈ చిత్ర కథానాయిక కాజల్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల నుంచి పూర్తిగా తప్పుకుంది. ఈ చిత్రంలో కమల్ భార్యగా కాజల్ నటిస్తోంది. ఆమె తన పార్ట్ షూటింగ్ పూర్తి కూడా చేసుకుంది. కానీ ప్రమోషన్స్ కు మాత్రం దూరంగా ఉండడంతో తెరపైకి కొత్త అనుమానాలు వచ్చాయి. కొంపదీసి కాజల్ సన్నివేశాలు డిలీట్ చేశారా? అనే డౌట్ కాజల్ అభిమానులలో నెలకొంది. కానీ శంకర్‌కి ఇండియన్ 3 ఆలోచన వచ్చిన తర్వాత, ఆమె పోర్షన్‌లను పూర్తిగా ఇండియన్ 3కి మార్చారు.

కాజల్ టీంపై కోపంగా ఉందా?

కాగా కాజల్ ఇండియన్ 2లో కనిపించదు. అందుకే ఆమె సినిమాను ప్రమోట్ చేయడం లేదు. టీమ్ కాజల్‌ని సంప్రదించి, అదే విషయాన్ని తెలియజేసిందా లేదా ఆమె ఇండియన్ 2 టీమ్‌పై కోపంగా ఉందా అనేది అస్పష్టంగా ఉంది. ఇండియన్ 3 మొత్తం షూటింగ్ పార్ట్ కూడా పూర్తయింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. సురేష్ బాబు తో కలిసి ఏషియన్ సునీల్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. కానీ ఈ సినిమాపై హైప్ మాత్రం ఊహించినంతగా లేదనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు